తెలంగాణ

కొత్త జిల్లాలతో పెరగనున్న కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 17: తెలంగాణ రాష్ట్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆశ పెట్టుకున్నారని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు, మండలాలతో కొత్త పోస్టులు వస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. గురుకుల పాఠశాలల్లో త్వరలోనే 2400ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. పరీక్ష ఆంగ్లంలోనే రాయాల్సి ఉంటుందని, తెలుగుమీడియం వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మాత్రం ఆంగ్లంలోనే రాయాలన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట పత్తిమార్కెట్‌యార్డులో మంత్రి హరీష్‌రావు సహకారంతో నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆదివారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం ఫ్రత్యేకంగా సాగు, తాగునీటి రంగం పై దృష్టి పెట్టిందని, త్వరలోనే నీటి సమస్య పరిష్కారమైతుందన్నారు. నిధులు సైతం అధికంగా వస్తున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందన్నారు. ఉద్యోగాల భర్తీ, నిధులు, నియామకాల్లా కాదన్నారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామినిచ్చిందని, దానికి కట్టుబడి వివిధ శాఖల్లో 25వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం మీద యువత పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారని, సిఎం కెసిఆర్ పారదర్శకంగా, నిజాయితీగా అర్హులకు ఉద్యోగాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసి పారదర్శకంగా భర్తీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో 2 అవార్డులు అందుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా టెక్నాలజీ వినియోగించుకొని బయోమెట్రిక్ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళ పరిస్థితుల ఆంశాల పై అవగాహన ఉంటేనే పోటీ పరీక్షల్లో రాణిస్తారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారం పై అవగాహన లేకుంటే ఉద్యోగం చేయడం కష్టమన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్‌కు 6లక్షల మంది అప్లై చేసుకున్నారని, వాయిదా పడిందన్నారు.
త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ మరోసారి జారీ చేస్తామని, 7లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా ప్రతి పోటీ పరీక్షకు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. నోటిఫికేషన్‌తోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల తేదీలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థుల పై వారికి నమ్మకం ఉంటేనే ఉద్యోగం వస్తుందన్నారు. గ్రూప్ 1పోస్టులు తక్కువగా ఉన్నాయని, కమలనాథ్ కమిషన్ ఉద్యోగుల విభజన తర్వాతే ఎన్ని పోస్టులో తేలుతాయని, తర్వాతే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మున్సిపల్ శాఖలో శానిటరీ ఇన్స్‌పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖలో ఏఇఓ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నీటి పారుదల శాఖలో ఇప్పటికే 2500ఏఇ పోస్టులు భర్తీ చేశామన్నారు. పోటీ పరీక్షల్లో ఆంగ్లం పై కచ్చితంగా పట్టు ఉండాలన్నారు. ఉద్యోగం పొందాలనే కసి, పట్టుదలతో చదివితేనే రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యమండలి వైస్ చైర్మన్ మల్లేశం, ప్రొ. బసవయ్య, నిర్వాహకులు జగదీష్, ఓఎస్డీ బాల్‌రాజ్, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.