తెలంగాణ

సిట్ అదుపులో వైకాపా నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 9: నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం సిట్ బృందం చేపట్టిన విచారణలో అతనితో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి యువనేతను జగిత్యాలలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన జగిత్యాలలో శుక్రవారం కలకలం సృష్టించింది.
నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం అతని నేరాలపై సిట్ అధికారుల విచారణ బృందం జరుపుతున్న దర్యాప్తులో జగిత్యాలకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి నేత కట్ట శివ నరుూం అనుచరులతో సన్నిహిత సంబంధాలు నెరపినట్లు అనుమానిస్తూ అతన్ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో శివ భార్య వైఎస్‌ఆర్‌సిపి తరపున అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. కాగా ఈవిషయంపై స్థానిక పోలీసు అధికారులను వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు.