తెలంగాణ

హెలి టూరిజం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని హెలి టూరిజం దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని అందాలను హెలికాప్టర్‌నుంచి తిలకించే అవకాశం పర్యాటకులకు లభించింది. నెక్లెస్ రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు హెలి టూరిజంను ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక శాఖ- ఇండివెల్ ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా హెలి టూరిజం ప్రారంభించాయి. రూ.3,499 రూపాయల చార్జీతో పర్యాటకులు హెలికాప్టర్‌లో నగరంలోని పర్యాటక కేంద్రాలను చూడవచ్చు. రోజుకు 10-15 ట్రిప్పులను తిప్పుతారు. దాదాపు 20 నిమిషాల పాటు నగరంలోని పర్యాటక కేంద్రాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ హెలికాప్టర్‌లో ఒకేసారి నలుగురు ప్రయాణించవచ్చు. అనేక అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా హైదరాబాద్ నగరంలోనూ హెలి టూరిజం ప్రారంభం కావడం పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్టు అయిందని పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరుస్తామని, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. యాదాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు.
మూసీ సుందరీకరణ
హుస్సేన్ సాగర్‌లోకి మురికి నీటిని తీసుకువచ్చే కాలువల మళ్లింపు పూర్తయిందని, త్వరలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పూర్తవుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ మారుతుందని అన్నారు. రాజధాని నగరం మధ్యలో ఇంత విశాలమైన చెరువు దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అదేవిధంగా మూసీకి పూర్వవైభవం తీసుకు వస్తామని చెప్పారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగర వాసులు ఆహ్లాదకరంగా గడిపేందుకు అనువుగా హుస్సేన్‌సాగర్, మూసీతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్టు కెటిఆర్ తెలపారు. హుస్సేన్ సాగర్‌తో పాటు సంజీవయ్య పార్కును పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో మంగళవారం హెలి టూరిజాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న తెలంగాణ మంత్రులు కెటిఆర్, చందూలాల్