తెలంగాణ

ఐదోసారి గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఐదవసారి చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికైంది. ఈసారి కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు, నృత్య ప్రదర్శనలను కన్నుల పండుగగా నిర్వహించారు. చుట్టూ కోట, మధ్యలో జాతీయ జెండా ఆవిష్కరణ, కోట గోడలపై కళాకారుల నృత్య ప్రదర్శనలు కన్నుల పండుగగా నిలిచాయి. ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు ఇదే వేదిక నుంచి వెనుకబడిన తరగతుల స్వయం ఉపాధి పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభ దినాన రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు సీఏం కేసీఆర్ ప్రకటించారు. కంటి వెలుగు కార్యక్రమం, రైతు బీమా పథకం రెండింటిని ఇదే రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు బయలుదేరుతూ ప్రగతి భవన్‌లోనూ సీఏం కేసీఆర్ జెండా ఎగురవేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి అమరసైనికుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకున్నారు.