క్రీడాభూమి

ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 23: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మునుపటి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించడంతో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ వరుసగా 97, 103 పరుగులు సాధించడంతో భారత్ 203 ఆధిక్యంతో ఆతిధ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ వరుసగా 149, 51 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో పేలవమైన ప్రదర్శన కారణంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండో స్థానానికి దిగజారాడు. మళ్లీ ఇపుడు మూడో టెస్టులో అద్భుత ఆటతీరును కనబరచడం ద్వారా 937 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 11వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (961 పాయింట్లు), స్టీవెన్ స్మిత్ (947), లెన్ హటన్ (945). జాక్ హబ్స్ (942), రికీ పాంటింగ్ (942), పీటర్ మే (941), గారీ సోబెర్స్, క్లైడ్ వాల్‌కాట్, వివియన్ రిచర్డ్స్, సంగరక్క (938 పాయింట్లు) వరుసగా రేటింగ్ పాయింట్లు సాధించారు.