తెలంగాణ

కన్నుల పండువగా ధర్మపురీశుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఆదివారం రాత్రి శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన మువ్వురు ఇలవేలుపుల కల్యాణోత్సవాల సందర్భంగా సాయంత్రం అర్చకులు చిలుకముక్కు రమణాచార్య గృహానికి వేంచేసిన స్వాములకు ప్రత్యేక పూజలొనరించారు. సాయంత్రం గోధూళి శుభ ముహూర్తంలో సర్వాంగ శోభితంగా తీర్చి దిద్దిన నూతన నిర్మిత కల్యాణ వేదికయైన దేవస్థానంలోని శేషప్ప కళా వేదికపైకి ఆలయాలనుండి స్వాముల ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలతో భక్తజనం తోడురాగా కొనితెచ్చి ఆసీనులగావించారు. సంప్రదాయ రీతిలో యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధనం, మహాసంకల్పం, భాసిక ధారణం, గోత్రనామ ప్రవరలు, కన్యాదానం, మంగళాష్టకములు, గూడ జీరధారణ, అక్షతారోపణాది కార్యక్రమాలను విధివిధానంగా నిర్వహించారు. ప్రభుత్వ పక్షాన సబ్ కలెక్టర్ శశాంక, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్, మేజర్ పంచాయతి పక్షాన సర్పంచ్ సత్తమ్మ, కార్యదర్శి రాజరెడ్డి, పాలకవర్గం తదితరులు వేరువేరుగా స్వాములకు పట్టు వస్త్రాలు, కట్నకానుకలను సమర్పించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్షేత్ర ప్రాచీన ఆచార నేపథ్యంలో, రాత్రి 10గంటలకు ప్రధానాలయాలలో మూల విరాట్టులకు తిరు కల్యాణం జరిపించారు.

యాదాద్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

నల్లగొండ, మార్చి 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల పర్వం ఆదివారం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం.. డోలోత్సవాలతో ముగిసింది. ఈనెల 10నుండి 11రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార, దివ్యవాహన సేవలతో పాటు లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం, దివ్య విమాన రథోత్సవం, చక్రతీర్థం ఉత్సవ ఘట్టాలన్నీ ఆద్యంతం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు ఆదివారం ఉదయం 10గంటలకు లక్ష్మీనరసింహస్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకంను ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలోని అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహణతో యాదాద్రి బ్రహ్మోత్సవాల ఘట్టం పరిసమాప్తమైంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు ఆదివారం కూడా కావడంతో గుట్టకు భక్తుల రాక పెరిగిపోవడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి.

లక్ష్మీనరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తున్న దృశ్యం