తెలంగాణ

పాలమూరు ఎత్తిపోతలకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 30: ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయ్యింది. కొందరు పథకం టెండర్లు, భూసేకరణ విషయంలో హైకోర్టుకు వెళ్లగా గత రెండు రోజుల క్రితం హైకోర్టు ధర్మాసనం కూడా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సానుకూలంగా తీర్పును ఇచ్చింది. బచావో తెలంగాణ వ్యవస్థాపకులు, మాజి మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో వేసిన పిటిషన్‌కు స్వీకరించిన కోర్టు విచారణ అనంతరం కేసును కొట్టి వేస్తూ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే అంటూ తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయ్యినట్లే. నార్లపూర్, ఎదుల, వట్టెం, కర్వెనా, ఉదండాపూర్ రిజర్వాయర్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే వీటికి సంబంధించిన టెండర్లను కూడా వేసింది. 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును 18 ప్యాకేజిలుగా రూపకల్పన చేశా రు. రూ. 32,500 కోట్లతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. నార్లపూర్ రిజర్వాయర్ పరిధిలోని 2200 ఎకరాలు ఎదుల, 3284 ఎకరాలు వట్టెం 4526 ఎకరాలు కర్వెనా 6408 ఎకరాలు భూసేకరణ అవసరం ఉండగా ఇప్పటికే ప్రతి రిజర్వాయర్ భూసేకరణ 75శాతానికి పైగా పూర్తి అయ్యింది. మరో నెల రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటివల సంబంధిత జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షించి ఏప్రిల్ 15వ తేదీలోగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏకకాలంలో పనులు ప్రారంభించడానికి రూపకల్పన చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముందుగా ఈ పనులను ప్రారంభించి మూడేళ్లలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సిఎం ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు. దాంతోనే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. ఈ పథకంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ముందుగా అధికారులు కొంత ఆందోళన చెందినప్పటికీ చివరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సజావుగానే ఉందని హైకోర్టు ధర్మాసనం తీర్పును ఇస్తూ నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్ కొట్టివేయడంతో అధికారులు, తెరాస నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక పనుల ప్రారంభమే చేపట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.