తెలంగాణ

ఆరు బిల్లులకు మండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ శాసనమండలిలో బుధవారం ఆరు ప్రధాన బిల్లులపై చర్చ జరిగి, ఆమోదముద్ర పడింది. అనంతరం బిల్లులను శాసన మండలి ఆమోదిస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.
ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ సభలో ద్రవ్య వినిమయ బిల్లు సహా మొత్తం ఆరు బిల్లులపై అధికార, విపక్షాల మధ్య చర్చ జరిగింది. వీటిలో విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల నియామకం అధికారం విషయంలో గవర్నర్‌దే తుది నిర్ణయం ఉండాలని, దీనిపై అధికార పక్షం స్పష్టమైన హామీ ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు విశ్వవిద్యాలయాల బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి, ఛాన్సలర్‌గా గవర్నర్‌నే కొనసాగించాలన్నారు. విశ్వవిద్యాలయం పనితీరు, ఆస్తుల పరిరక్షణ, నియామకాల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించటం లేదని ఆయన విమర్శించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. బిజెపి సభ్యుడు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు అటానమస్ బాడీలని, వీటిలో స్థానిక ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ సభ్యుడు సయ్యద్ అల్తాబ్ రజ్వి, టిఆర్‌ఎస్ సభ్యుడు గంగాధర్‌గౌడ్‌తో పాటు పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. తెలంగాణ వ్యవసాయోత్పత్తి, జీవధన మార్కెట్ల బిల్లు, 2016 తెలంగాణ జీతములు, పించన్ల చెల్లింపు సవరణ బిల్లు, తెలంగాణ ద్రవ్య వినిమియ బిల్లు 2016, తెలంగాణ మార్కెట్ల బిల్లులకు సంబంధించి మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. వీటిపై కాంగ్రెస్ మండలి పక్ష నేత షబ్బీర్ అలీ, సభ్యురాలు ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామచంద్రరావు, మజ్లిస్ సభ్యుడు రజ్విలు మాట్లాడుతూ తెలంగాణ మార్కెట్ల కమిటీ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించటం హర్షనీయమని పేర్కొంటూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, రిజ్వి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ నియామకాల్లో మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరటంతో ఇందుకు స్పందించిన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీ నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఇందులో భాగంగానే మహిళలకు 33 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బిసిలకు 29 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు నాలుగు శాతాన్ని బిసిలకు కేటాయించిన 29 శాతంలో భాగమేనని వివరించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీలకు కూడా వార్షిక కోటను రూ. 3 కోట్లకు పెంచుతున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.