తెలంగాణ

ఐదు రకాల యుద్ధానికి సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: గతంలో భూమి, నీరు, వాయు మార్గాల్లో మూడు రకాలైన యుద్ధాలు మాత్రమే జరిగేవని, కానీ ప్రస్తుతం ఈ మూడింటికీ తోడు అంతరిక్షం, సైబర్ ప్రపంచం కూడా తోడైందని, ఐదు రకాల యుద్ధాలకు దేశాలు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని డీఆర్‌డీఓ చైర్మన్ , రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు రకాల యుద్ధాలలో విజయం సాధించడానికి కావల్సిన సమాచారం రియల్‌టైం, ఆన్‌లైన్‌లో సేకరించగలిగితేనే విజయం సాధ్యమవుతుందని అన్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని వినియోగిస్తూ టార్గెట్‌ను ఖచ్చితంగా గుర్తించి, గమనించి, ఇతరుల నుండి వేరు చేసి హిట్ చేయగలిగే సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా సమచారాన్ని అందించగలిగే సెన్సార్ల నుండి సమాచారాన్ని సేకరించి, దానిని సమీకరించి, ఒక చోటుకు చేర్చి, పూర్తిగా విశే్లషించి, అనంతరం ప్రెసిషన్ టార్గెట్‌లో పని పూర్తిచేయాల్సిన అగత్యం ఏర్పడిందని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరిశోధనలు, ఉత్పత్తులు చేసే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని సతీష్‌రెడ్డి సూచించారు. ఫిన్స్- ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, భారతదేశ రక్షణ రంగం విషయాలపై పనిచేస్తున్న జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ రక్షణ రంగం తయారీలో స్వావలంబన పేరిట నిర్వహించిన సదస్సులో డాక్టర్ సతీష్‌రెడ్డితో పాటు డిప్యుటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్, చైర్మన్ జాయింట్ ఇంటిలిజెన్స్ కమిటీ ఎన్ రవి తదితరులు హాజరయ్యారు. సదస్సు కన్వీనర్ మేజర్ జనరల్ ఏబీ గోర్తి ఆహుతులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఫిన్స్ సంస్థ జాతీయ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డాక్టర్ డీబీ షెకాట్కర్ సదస్సు ఉద్ధేశ్యాలను, లక్ష్యాలను వివరించారు. రక్షణ రంగం కోసం అభివృద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం కేవలం సాయుధ బలగాల వినియోగానికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా విస్తృతంగా ఉపయోగపడుతున్నాయని సతీష్‌రెడ్డి అన్నారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం తయారీ కేవలం డీఆర్‌డీఓలు మాత్రమే తయారుచేయలేవని, అందుకోసం విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుందని సతీష్‌రెడ్డి అన్నారు. ఈ రంగంలో స్వావలంబన సాధించాల్సిన దిశగా భారత్ అడుగులు వేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేవారికి ప్రోత్సాహక పథకాన్ని కూడా డీఆర్‌డీవో రూపొందించిందని చెప్పారు. వీరికే కాకుండా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మంచి ఐడియాలతో ముందుకు వచ్చే యువతను, యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేక సహాయక నిధిని ఏర్పాటు చేశామని అన్నారు. తమ వద్దకు వచ్చే ప్రతి ప్రతిపాదననూ పూర్తిస్థాయిలో విశే్లషించి, మంచి ఐడియాలతో వస్తే ఇంక్యూబేట్ చేసి వాటిని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను డీఆర్‌డీఓ అందిస్తుందని అన్నారు.
దేశరక్షణ పూర్తిగా దేశానికి ఉన్న రక్షణ సామర్ధ్యంతో పాటు బలమైన రాజతంత్రం మీదనే ఆధారపడి ఉంటుందని నేషనల్ సెక్యూరిటీ డిప్యుటీ అడ్వయిజర్ ఎన్ రవి అన్నారు. మన పూర్వీకులు నేర్పిన రక్షణ రంగం తంత్రాలను మరిచిపోయి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్య ధోరణిలో పనిచేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. కానీ గత నాలుగున్నరేళ్లుగా దీనిని సరిచేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. భారతదేశాన్ని శక్తివంత దేశంగా తీర్చిదిద్దడంతో పాటు మనం ఏదైనా చేయగలం , సాధించగలమనే నమ్మకాన్ని కలిగించగలుగుతున్నామని చెప్పారు. రక్షణ రంగంలో శక్తివంతమైన దేశంగా పేరు గడించాలంటే యుద్ధ సామగ్రీ, రక్షణ రంగానికి చెందిన సాంకేతికలో ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తిస్థాయిలో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో లెఫ్టినెంట్ జనరల్ ఎస్ ఎస్ హస్బినిస్ తాజా స్థాతిని సదస్సుకు వివరించారు. తర్వాతి సదస్సులో సైబర్ వార్ ఫేర్, డిజిటల్ వార్ ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ వేర్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా అనలైటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై చర్చ జరిగింది. ఇక ముగింపు సమావేశంలో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు.