తెలంగాణ

హైట్ కోసం.. కాళ్లు కోశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఎత్తు పెంచేందుకు యువకుడి కాళ్లు కట్ చేసి రాడ్లు వేశారు గ్లోబర్ డాక్టర్లు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హైట్ కోసం వైద్యులు చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందో.. లేదోనంటూ బెంగతో ఆసుపత్రి ఎదుట వాపోతున్నారు. కూకట్‌పల్లికి చెందిన గోవర్ధన్‌రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి (22) మూడు రోజుల క్రితం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. కాగా తన కొడుకు నిఖిల్ రెడ్డి కనిపించడం లేదని కూకట్‌పల్లి పిఎస్‌లో గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా నిఖిల్ రెడ్డి తన ఎత్తు పెంచుకునేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడని, వైద్యులు కాళ్లు కట్ చేసి రాడ్లు వేస్తున్నారని తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో తమకు తెలియకుండా తన కుమారుడికి ఆపరేషన్ ఎలా చేస్తారంటూ నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనారోగ్యంతో ఉన్న తన కొడుకును ప్రేరేపించి హైట్ పెంచుతామని తమ అనుమతి లేకుండా వైద్యులు ఆపరేషన్ చేశారని ఆరోపించారు. తమ కొడుకును ఐసియూలోకి తీసుకెళ్లి ఏడు గంటలు దాటినా అతని ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని నిఖిల్ తల్లిదండ్రులు వాపోతున్నారు. నిఖిల్ ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందో తమకు బెంగగా ఉందని, తక్షణమే చూపించాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఆపరేషన్ కోసం రూ.4 లక్షలు తీసుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరో మూడు లక్షలు చెల్లించాలంటూ వైద్యులు చెబుతున్నారని అంటున్నారు. ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో వైద్యులు కొద్ది నిముషాలు మాత్రమే చూసేందుకు అనుమతించారు.
నిఖిల్ మేజర్.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు: వైద్యులు
హైట్ పెంచాలంటూ నిఖిల్ ఏడాదిగా తమ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాడని, తన స్నేహితులతో కలసి మూడ్రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శిబోజి చటోపాధ్యాయ తెలిపారు. అదేవిధంగా నిఖిల్ మేజర్.. తాము ఎవరికీ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలావుండగా ఆపరేషన్ లీగలా..? హైట్ పెంచేందుకు ఆపరేషన్ చేయవచ్చా..? అనే విషయమై ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ను వివరణ కోరగా తమ ఆసుపత్రిలో నిఖిల్‌కు జరిగిన ఆపరేషన్ లీగలేనని, ఆపరేషన్ నిఖిల్ ఇష్టానుసారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం... ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం