తెలంగాణ

‘మిషన్ కాకతీయ’ పనులు 30లోగా పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: మిషన్ కాకతీయ మొదటి దశ పనులు ఈ నెల 30వ తేదీలోగా పూర్తి కావాలని, ఇకపై ఆలస్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను హెచ్చరించారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారన్నారు. ఖమ్మంలో జిల్లాలో పనులు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత మూడు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఒప్పందాలు చేసుకోవాలని , ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయకు విస్తృత ప్రచారం కల్పించాలని, త్వరలో జిల్లాల్లో పర్యటించి ఈ పనులను స్వయంగా పరిశీలిస్తానని అధికారులకు స్పష్టం చేశారు. స్థానిక ప్రముఖులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రజలందరి సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎంఎల్‌ఏలు, ఎమ్మెల్సీలు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇతర ఉద్యోగులు ఒక్కో చెరువును దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఎస్‌ఇలు, డిఇలు, ఇఇలు జిల్లాలకు వెళ్లి విధులు నిర్వహించాలని, హైదరాబాద్‌లోనే ఉండి విధులు నిర్వహిస్తామంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, ‘కాడా’ డైరెక్టర్ మల్సూర్, ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డి శ్రీ్ధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.