తెలంగాణ

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నాలుగు వారాల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు నాలుగు వారాల జైలు శిక్షను విధిస్తూ ఆ వెంటనే పైకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఈ తీర్పును జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్‌తో కూడిన ధర్మాసనం వెలువరించింది. రాజధానిలో సూరారంలో ప్రభుత్వ భూమిలో రెండు వేల మంది ఆక్రమణదారులను తొలగించే విషయంలో విఫలమైనందుకు అధికారులపై చర్యలను తీసుకోవాలని కోరుతూ కెఆర్ భారతి మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయమై తమకు ఎప్పటికి ఎప్పుడు వివరాలు తెలియచేయాలంటూ హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆరు వారాల గడువు ఇచ్చింది. ఆక్రమణదారుల పేర్లు, ఎంత మందిని ఖాళీ చేయించారో వివరాలు తెలియచేయాలని ఆదేశించింది. అక్టోబర్ నెలలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు తమకు తగిన సమయం కావాలని కలెక్టర్ అడగ్గా అందుకు కోర్టు నిరాకరించింది. కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, నాలుగు వారాల జైలు శిక్ష, రెండు వేల జరిమానాను హైకోర్టు విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్ధన మేరకు పైకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తమ ఆదేశాలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది.

చెన్నైకి కావాల్సిన
సాయం అందిస్తాం
ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 2: భారీ వర్షాలు, వరదలతో అతులాకుతలం అయిన చెన్నై నగరాన్ని ఆదుకోవడానికి, అవసరమైన సహాయ, సహకారాలను అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై వాసులకు సహాయం అందించడానికి వారికి ఏమి కావాలో అడిగి తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సిఎం ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రాజీవ్ శర్మ నేరుగా మాట్లాడి కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం అందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.