తెలంగాణ

మీ మిషన్ బావుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ సలహాదారు పికె ఝా, డిప్యూటీ అడ్వైజర్ ఎకె జైన్‌లు అభినందించారు. పథకాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో అధికారులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. పథకాల అమలుకు కేంద్రం నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దానికి నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించింది. ఐదువేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నీతి ఆయోగ్‌ను నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశం దృష్టిని ఆకట్టుకున్నాయని, పథకాల అమలు తీరు ఏవిధంగా ఉందని సభ్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.నీతి ఆయోగ్ నుంచి మిషన్ కాకతీయకు ఐదువేల కోట్ల రూపాయల సహాయం అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు.
తెలంగాణలో 20వేల కోట్ల రూపాయల వ్యయంతో 46, 3531 చెరువులను ఐదేళ్లలో మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి యస్‌కె జోషి తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఇతోదికంగా సహాయం అందించాలని కోరారు. మొదటి దశలో 8,104 చెరువులకు గాను, 2,591 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 8, 032 చెరువులు గ్రౌండ్ కాగా, 4735 చెరువులలో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మే 2016 నాటికి 3297 చెరువులతో పనులు పూర్తి అవుతాయని, 667 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తీయటం జరిగిందని, 2.3 టిఎంసిల నీటి నిలువ సామర్ధ్యం పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. రెండవ దశలో 10,113 చెరువులను గుర్తించి, 2,619 కోట్లతో 8368 చెరువులకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. 6962 చెరువులకు టెండర్లు పిలిచి 3314 చెరువులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. 1980 చెరువుల్లో పనులు ప్రారంభించినట్టు నీతి ఆయోగ్ సలహాదారులకు వివరించారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల పెంపు రైతులకు అదనపు ఆదాయం, పర్యావరణ పరిరక్షణ, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, ఆయకట్టు పెంపు లాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి చెరువుకు ఒక ఐడి నెంబర్ కేటాయించి ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా పనులు చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 24,224 గ్రామాలు, 63 మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందించనున్న తీరును పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ వివరించారు. 42వేల కోట్ల అంచనా వ్యయంతో 39,272 టిఎంసిల నీటితో ప్రతి ఇంటికి మంచినీటిని అందించనున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ కోసం 1,30,168 కిలో మీటర్ల మేర పైపులైన్లు వేస్తున్నామని, చెప్పారు. మొదటి దశ కింద ఏప్రిల్ నుండి జూన్ 2016 నాటికి తొమ్మిది నియోజక వర్గాల్లో 2022 గ్రామాలకు మంచినీరు అందిస్తారు. ప్రస్తుతం అమలు అవుతున్న, కొనసాగుతున్న మంచినీటి పథకాలను మిషన్ భగీరథతో ఇంటీగ్రేట్ చేస్తున్నట్టు సింగ్ తెలిపారు. మిషన్ భగీరథకు కేంద్రం సహాయం చేయాలని ఎస్‌పి సింగ్ కోరారు.

చిత్రం... కాకతీయ, భగీరథ పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్న నీతిఆయోగ్ సలహాదారులు పికె ఝా, ఎకె జైన్