తెలంగాణ

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి.. రూ.8 వేల కోట్ల రుణానికి హడ్కో సంసిద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి అవసరమైన నిధుల్లో రూ.8 వేల కోట్ల వరకు రుణంగా మంజూరు చేసేందుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేసిందని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మరిన్ని నిధులు ఈ పథకం కోసం సమకూర్చుకోవాల్సి ఉందని, తక్కువ వడ్డీకి ఇతర దేశాల నుంచి నిధులు పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మంత్రి ప్రసంగించారు. ఈ వర్క్‌షాప్‌కు నిర్మాణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, బిల్డర్లు, ఆర్థిక భాగస్వామ్య ఏజెన్సీలు, క్రెడాయ్, నెరెడ్కో వంటి వివిధ కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా తక్కువ ధరకే నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన సాంకేతిక సలహాలు ఇవ్వాలని మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లను, గ్రేటర్ హైదరాబాద్ పరిధిరో మరో లక్ష ఇళ్లను మంజూరు చేసామన్నారు. 560 చదరపు అడుగుల స్థలంలో గ్రామీణ ప్రాంతంలో రూ.5.04 లక్షల వ్యయంతో, పట్టణ ప్రాంతంలో రూ.5.30 లక్షల వ్యయంతో, దీనికి అదనంగా రూ.75 వేలు వౌళిక సదుపాయాల కల్పనకు మంజూరు చేసి డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. అనుకున్న బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. తమ ప్రయత్నంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.

బుధవారం హైదరాబాద్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

17న ఎస్‌ఐ పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష

తెలంగాణలో 321 కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 1.86లక్షల మంది అభ్యర్థులు
దేశంలోనే తొలిసారిగా బయోమెట్రిక్ కేంద్రాలు
పోలీస్ శాఖ, జెఎన్‌టియు
సంయుక్త్ధ్వార్యంలో నిర్వహణ
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
డిజిపి అనురాగ్ శర్మ వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఈ నెల 17న జరగాల్సిన ఎస్‌ఐ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖ, జెఎన్‌టియు సంక్త్ధ్వార్యంలో అర్హత పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు తెలంగాణవ్యాప్తంగా 321 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,86,038 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఎస్‌ఐ పోస్టుల అర్హత పరీక్షకు అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిజిపి సూచించారు.
ఆదిలాబాద్‌లోని 16 పరీక్షాకేంద్రాల్లో 7,263 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని, కరీంనగర్ 44 కేంద్రాల్లో 21614 మంది అభ్యర్థులు, ఖమ్మం 35 కేంద్రాల్లో 15878 మంది, వరంగల్ 31 కేంద్రాల్లో 20727 మంది అభ్యర్థులు, మహబూబ్‌నగర్ 26 కేంద్రాల్లో 11988 మంది, నల్గొండ 33 కేంద్రాల్లో 15377 మంది అభ్యర్థులు, నిజామాబాద్ 19 కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు, రంగారెడ్డి/హైదరాబాద్-1లోని 21 కేంద్రాల్లో 14620 మంది అభ్యర్థులు, అదేవిధంగా రంగారెడ్డి/హైదరాబాద్-2లోని 30 కేంద్రాల్లో 23603 మంది అభ్యర్థులు, రంగారెడ్డి/హైదరాబాద్-3లోని 46 కేంద్రాల్లో 33593 మంది, రంగారెడ్డి/హైదరాబాద్-4లోని 10 కేంద్రాల్లో 6676 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని డిజిపి పేర్కొన్నారు.
820 బయోమెట్రిక్ డివైసెస్‌లో 12597 మంది అభ్యర్థులు పాల్గొంటారని డిజిపి అనురాగ్ శర్మ వివరించారు.

మాలేగావ్ పేలుళ్లను
రాజకీయం చేస్తున్న ఎన్‌ఐఏ

ఎంపి అసదుద్దీన్ ఒవైసీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ దర్యాప్తు సంస్థ మాలేగావ్ పేలుళ్లను రాజకీయం చేస్తుందని ఆలిండియా మజ్లిస్-ఎ-ఇతెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బుధవారం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాలేగావ్ పేలుళ్ల కేసులో తొమ్మిది మంది ముస్లిం యువకులు తమకు పేలుళ్లతో సంబంధం లేదని కేసు డిశ్చార్జి కోసం చేసుకున్న దరఖాస్తుపై ఎన్‌ఐఏ అభ్యంతరం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇది న్యాయ విరుద్ధమన్నారు. పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది ముస్లిం యువకులు నిందితులు కాదంటూ క్లీన్ చిట్ ఉన్నప్పటికీ ట్రయల్ రన్ నిందితులుగా పేర్కొనడం సమంజసం కాదన్నారు. యువకులను ఏ కారణం చేత ట్రయల్ రన్ కింద ఉంచబడతారన్నారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులోని నిందితులకు ఒక న్యాయం, మాలేగావ్ పేలుళ్ల కేసులోని నిందితులకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనలో నిర్దోషులైన 9మంది ముస్లిం యువకులను వెంటనే డిశ్చార్జి చేయాలని అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఫైర్ స్టంట్ ప్రయత్నంలో పాతబస్తీకి చెందిన యువకుడు జలాలుద్దీన్ (19) మృతి చెందడం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రియాల్టీషోలను అనుకరించొద్దని అసదుద్దీన్ ఒవైసీ యువకులకు సూచించారు.