క్రీడాభూమి

సెమీస్‌కు టీమిండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్ అజేయ యాత్రను కొనసాగిస్తున్నది. గురువారం వెస్టిండీస్‌ను 125 పరు గుల తేడాతో చిత్తుచేసి సెమీస్‌లో చోటును దాదాపుగా ఖాయం చేసుకుం ది. సాంకేతికంగా మాత్రమే భారత్‌కు నాకౌట్ అడ్డంకులు ఏర్పడతాయి. అయతే, ప్రస్తుత పరిస్థితులను, ఇతర జట్ల బలాబలాలను బేరీజు వేసుకుం టే టీమిండియా సెమీస్ చేరడం ఖాయమైంది. భారత్ నిర్దేశించిన 269 ప రుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బ్యాటింగ్ చేసిన విండీస్ ఏ దశలో నూ ఆ స్థాయ ఆటను ప్రదర్శించలేకపోయింది. మహమ్మద్ షమీ 16 పరు గులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషిం చాడు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకాలతో రాణించి, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు.
సహజంగా లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రాధాన్యం ఇచ్చే టీవిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు భిన్నంగా విండీస్‌పై టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్‌కు ఛేజింగ్‌ను అప్పగించడం ద్వారా తీవ్రమైన ఒత్తిడికి గురిచేయాలన్న వ్యూహాన్ని కోహ్లీ అనుసరించినట్టు స్పష్టమవుతున్నది. అయితే, ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఔటైన రోహిత్ శర్మ 23 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 18 పరుగులు చేశాడు. కెమెర్ రోచ్ బౌలింగ్‌లో అతను వికెట్‌కీపర్ షాయ్ హోప్ సులభమైన క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన రాహుల్ 64 బంతుల్లో, ఆరు ఫోర్లతో 48 పరుగులు చేసి, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇన్ స్వింగ్ బంతిని నిర్లక్ష్యంగా ఆడిన అతను భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించగా, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్ 19 బంతుల్లో 14 పరుగులు చేసి, కెమెర్ రోచ్ బౌలింగ్‌లో కీపర్ షాయ్ హోప్‌కి చిక్కాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు ఉన్నాయి. హార్డ్ హిట్టర్ కేదార్ జాదవ్ ఏడు పరుగుల మాత్రమే చేసి, షాయ్ హోప్ క్యాచ్ అందుకోగా, కెమెర్ రోచ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నింపాదిగా బ్యాటింగ్ చేస్తుండగా, స్కోరుబోర్డును ముందుకు దూకించే బాధ్యతను తీసుకున్న కోహ్లీ 82 బంతుల్లో, ఎనిమిది ఫోర్లతో 72 పరుగులు చేసి, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డెరెన్ బ్రేవో క్యాచ్ అందుకోగా, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఓ కెప్టెన్ వికెట్‌ను మరో కెప్టెన్ సాధించడం గమనార్హం. కోహ్లీ వికెట్ కూలడంతో క్రీజ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్య రన్‌రేట్‌ను పెంచడమే లక్ష్యంగా ఆడాడు. ఒకానొక దశలో ధోనీ, హార్దిక్ ఇద్దరూ సమానంగా 23 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ స్కోరు కోసం ధోనీ 43 బంతులు ఆడితే, హార్దిక్‌కు 22 బంతులే పట్టాయి. జట్టు స్కోరు 250 పరుగుల వద్ద హార్దిక్ వికెట్ కూలింది. 38 బంతులు ఎదుర్కొన్న అతను ఐదు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి, షెల్డన్ కాంట్రెల్ బౌలింగ్‌లో ఫాబియన్ అలెన్‌కు దొరికిపోయాడు. అదే ఓవర్ ఐదో బంతికి మహమ్మద్ షమీ (0)ని షాయ్ హోప్ క్యాచ్ అందుకోగా కాంట్రెల్ ఔట్ చేశాడు. ధోనీ 61 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 268 పరుగులు చేసింది. ధోనీతోపాటు కుల్దీప్ యాదవ్ (0) అప్పటికి క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో కెమెర్ రోచ్ 10 ఓవర్లలో 36 పరుగులకే మూడు వికెట్లు సాధించాడు. షెల్డన్ కాంగ్రెల్ 50 పరుగులిచ్చి రెండు, జాసన్ హోల్డర్ 33 పరుగులకు 2 చొప్పున వికెట్లు పడగొట్టారు.
గేల్ ఫ్లాప్ షో
విండీస్ బ్యాటింగ్ స్టార్ క్రిస్ గేల్ మరోసారి ఫ్లాప్ షోతో అభిమానులను నిరాశపరిచాడు. ఇటీవల కాలంలో ఏమాత్రం ఫామ్‌లో లేని అతను ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమై, కేదార్ జాదవ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 పరుగులకే తొలి వికెట్‌ను విండీస్ చేజార్చుకుంది. షమీ అదే దూకుడును కొనసాగించి షాయ్ హోప్ (5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నికోలస్ పూరన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను బలోపేతం చేసేందుకు శ్రమించిన సునీల్ ఆంబ్రిస్‌ను హార్దిక్ పాండ్య ఎల్‌బీగా ఔట్ చేసి, విండీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 71 పరుగులకే మూడో వికెట్ కూడా కోల్పోయన విండీస్ సమస్య లు రెట్టింపయ్యాయ. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంపింగ్ అవకా శాన్ని ధోనీ జారవిడిచాడు. లేకపోతే, విండీస్ అదే స్కోరువద్ద నాలుగో వికెట్ కూ డా చేజార్చుకునేది. ధాటిగా ఆడుతున్న నికొలస్ పూర్ (28)ను మహమ్మద్ షమీ క్యాచ్ పట్టగా కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఈ వికెట్ కూలడంతో, విండీస్‌కు లక్ష్య ఛేదన కష్టంగా మారింది. కెప్టెన్ జాసన్ హోల్డర్ కేవలం 6 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించగా, విండీ స్ ఓటమి దాదాపుగా ఖాయమైంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జ ట్టు 5 వికెట్లకు 101 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చిన కార్లొస్ బ్రాత్‌వెయట్ (1) ఔటయ్యా డు. తర్వాతి బంతికే ఫాబియన్ అలెన్ (0)ను బుమ్రా ఎల్‌బీగా పెవిలియన్ కు పంపాడు. ఆ ఓవర్‌ను బుమ్రా డబుల్ వికెట్ మెయడిన్‌గా పూర్తి చేయ డం విశేషం. క్రీజ్‌లో పాతుకుపోయేందుకు చివరి వరకూ ప్రయత్నించిన ష మ్రన్ హేత్‌మేయర్ 18 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో లోకే ష్ రాహుల్ క్యాచ్ పట్టుకోవడంతో ఔటయ్యాడు. తన బౌలింగ్‌లో ఓ ఫోర్, మరో సిక్సర్ కొట్టిన షెల్డన్ కాంట్రెల్‌ను యుజువేంద్ర చాహల్ ఎల్‌బీగా ఔ ట్ చేశాడు. ఒషేన్ థామస్ 6 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు 34.2 ఓవర్లలో 143 పరుగు ల వద్ద తెరపడింది.
ఈ టోర్నమెంట్‌లో ఇంత వరకూ అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 బౌలర్ల జాబితాలో భారత బౌలర్లు లేరు. కానీ, జట్టు బౌలింగ్ పటిష్టంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్న కారణం గానే భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లనూ గెల్చుకుంది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లేకపోతే, ఆ జట్టును కూడా ఓడించి ఉండేదని అభిమానుల ధీమా. మొత్తం మీద భారత్ బ్యాటింగ్ లైనప్ విఫలమైన సందర్భాల్లోనూ బౌలర్లు జట్టును ఆదుకుంటున్నారు. జట్టు బౌలర్లంతా తమకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడాన్ని శుభసూచకంగా పేర్కోవాలి.
*ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో ధోనీ స్టంప్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. విండీస్ వికెట్‌కీపర్ షాయ్ హోప్ గందరగోళపడి, ధోనీని స్టంప్ చేయలేకపోయాడు. గత మ్యాచ్‌లోనూ, ఆరంభంలోనే స్టంపింగ్ ప్రమాదం నుంచి బయటపడిన ధోనీ, ఈ మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అదే తరహాలో ఔట్ కాకుండా ఊపిరి పీల్చుకున్నాడు. 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి లైఫ్ ఇచ్చినందుకు విండీస్ భారీగానే నష్టపోయింది.
స్కోరు బోర్డు
భారత్: లోకేష్ రాహుల్ బీ జాసన్ హోల్డర్ 48, రోహిత్ శర్మ సీ షాయ్ హోప్ బీ కెమెర్ రోచ్ 18, విరాట్ కోహ్లీ సీ (సబ్‌స్టిట్యూట్) డారెన్ బ్రేవో బీ జాసన్ హోల్డర్ 72, విజయ్ శంకర్ సీ షాయ్ హోప్ బీ కెమెర్ రోచ్ 14, కేదార్ జాదవ్ సీ షాయ్ హోప్ బీ కెమెర్ రోచ్ 7, మహేంద్ర సింగ్ ధోనీ 56 నాటౌట్, హార్దిక్ పాండ్య సీ ఫాబియన్ అలెన్ బీ షెల్డన్ కాంట్రెల్ 46, మహమ్మద్ షమీ సీ షాయ్ హోప్ బీ షెల్డన్ కాంట్రెల్ 0, కుల్దీప్ యాదవ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 268.
వికెట్ల పతనం: 1-29, 2-98, 3-126, 4-140, 5-180, 6-250, 7-252.
బౌలింగ్: షెల్డన్ కాంట్రెల్ 10-0-50-2, కెమెర్ రోచ్ 10-0-36-3, ఒషేన్ థామస్ 7-0-63-0, ఫాబియన్ అలెన్ 10-0-52-0, జాసన్ హోల్డర్ 10-2-33-2, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 3-0-33-0.
వెస్టిండీస్: క్రిస్ గేల్ సీ కేదార్ జాదవ్ బీ మహమ్మద్ షమీ 6, సునీల్ ఆంబ్రిస్ ఎల్‌బీ హార్దిక్ పాండ్య 31, షాయ్ హోప్ బీ మహమ్మద్ షమీ 5, నికొలస్ పూరన్ సీ మహమ్మద్ షమీ బీ కుల్దీప్ యాదవ్ 28, షిమ్రన్ హేత్‌మేయర్ సీ లోకేష్ రాహుల్ బీ మహమ్మద్ షమీ 18 జాసన్ హోల్డర్ సీ కేదార్ జాదవ్ బీ యుజువేంద్ర చాహల్ 6, కార్లొస్ బ్రాత్‌వె యట్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ జస్‌ప్రీత్ బుమ్రా 1, ఫాబియన్ అలెన్ ఎల్‌బీ జస్‌ప్రీత్ బుమ్రా 0, కెమెర్ రోచ్ 14 నాటౌట్, షెల్డన్ కాంట్రెల్ ఎల్‌బీ యుజువేంద్ర చాహల్ 10, ఒషేన్ థామస్ సీ రోహిత్ శర్మ బీ మహమ్మద్ షమీ 6, ఎక్‌స్ట్రాలు 18, మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌ ట్) 143.
వికెట్ల పతనం: 1-10, 2-16, 3-71, 4-80, 5-98, 6-107, 7-107, 8-112, 9-124, 10-143.
బౌలింగ్: మహమ్మద్ షమీ 6.2-0-16-4, జస్‌ప్రీత్ బుమ్రా 6-1-8-2, హార్దిక్ పాండ్య 5-0-28-1, కుల్దీప్ యాదవ్ 9-1-35-1, కేదార్ జాదవ్ 1-0-4-0, యుజువేంద్ర చాహల్ 7-0-39-2.
*
చిత్రం... షాయ్ హోప్ వికెట్ పడగొట్టిన మహమ్మద్ షమిని అభినందిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ