తెలంగాణ

సఖ్యతతో సాగుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 15: కయ్యాలకు, గిల్లికజ్జాలకు పోకుండా పరస్పరం సహకరించుకుందామని ఆంధ్ర సర్కారుకు తెలంగాణ సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో మెలగుతూ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. దుమ్ముగూడెం తర్వాత ఎలాగూ గోదావరి జలాలను తెలంగాణ వాడుకునే వీలు లేదని, 1000 టిఎంసిలు తెలంగాణ వాడుకున్నా, మిగిలిన 1500 టిఎంసిలు ఆంధ్రా ప్రజలకు ఉపయోగపడతాయని అన్నారు. గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా కలిసే బదులు తెలుగు ప్రజలు ఎవరు వాడుకున్నా ఫరవాలేదని కెసిఆర్ అన్నారు. తెలంగాణతో నీటి వివాదాలు లేకుండా సఖ్యతతో వ్యవహరిస్తామని చంద్రబాబే చెప్పారని, తాను కూడా అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయాన్ని చెప్పానని కెసిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కల్యాణానికి విచ్చేసిన కెసిఆర్, అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రాలో విలీనమైన భద్రాచలం నియోజకవర్గంలోని పంచాయతీలను తిరిగి ఇచ్చేందుకు ఇటీవల అమరావతిలో ఆంధ్ర సిఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రి తరహాలో ఆర్కిటెక్ట్ ఆనందసాయి పర్యవేక్షణలో జీయర్‌స్వామి, ఆగమశాస్త్ర పండితుల సూచనలు, సలహాల ప్రకారం ఆలయంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సమయాభావం వల్ల తాను స్వయంగా పరిశీలించలేక పోయానని, త్వరలో జీయర్‌స్వామితో కలిసి వచ్చి ఎక్కడెక్కడ ఏమి అవసరమో పరిశీలించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు, సీతారామప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేసి, జిల్లాలో అంగుళం భూమిని కూడా వదలకుండా సాగునీటితో అభిషేకం చేస్తామన్నారు. సీతారామప్రాజెక్టు కోసం ఇంజనీర్ల కంటే కూడా తనతోపాటు తుమ్మల నాగేశ్వరరావు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. ఖమ్మం జిల్లా కృష్ణా, గోదావరి బేసిన్‌లకు మధ్యన ఉన్నా కరవు, తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇదంతా గత పాలకుల పాపమేనన్నారు. కానీ ప్రతిపక్షాలు తాము చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గోదావరి జలాలతోనే ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మిషన్ భగీరథ గురించి నీతి అయోగ్ ఛైర్మన్ ప్రశంసలు కురిపిస్తే మన ప్రతిపక్షాలు మాత్రం లేనిపోని ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. పోడు భూముల సమస్య గురించి కూడా ఢిల్లీలో పర్యావరణ శాఖతో మాట్లాడామని అన్నారు. భద్రాచలం టెంపుల్‌సిటీ గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్పందిస్తూ...ఆలోచన ఉందని, గిరిజన చట్టాలు, ఇతర విషయాలపై త్వరలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక భద్రాచలంలోనే వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపిలు బాల్క సుమన్, సీతారామ్‌నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం కెసిఆర్