తెలంగాణ

రాష్ట్రానికి కెడిఎక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, త్రీడి తెర ఉన్న టీవి, సెల్‌ఫోన్‌లను తయారు చేసే కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ కెడిఎక్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారు చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో కెడిఎక్స్ మాత్రమే. ఇలాంటి సదుపాయాలతో ఇప్పటికే ఈ కంపెనీ మొబైల్ ఫోన్లను తయారు చేసింది. ఫిలిప్స్, డాల్బీ 3డి వంటి ప్రముఖ ఎంటర్‌టైన్ మెంట్ సంస్థలతో కలిసి ఈ కంపెనీ పని చేస్తోంది. వినోద పరిశ్రమ అవసరాల కోసం ఉపయోగించే ఫిల్మ్ తయారీలో తమ కంపెనీ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని కంపెనీ ప్రతినిధులు ఐటి మంత్రి కె తారక రామారావుకు వివరించారు. గత సంవత్సరం తమ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిందని, గ్రూప్ విస్తరణలో భాగంగా తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఐటి మంత్రితో సమావేశం అయిన తరువాత హైదరాబాద్‌లో ఉన్న వౌలిక సదుపాయాలను పరిశీలించారు.
కెడిఎక్స్‌తో పాటు ఎంఓయులో భాగస్వామి ఎరాయిస్ ఎపికా గ్రూపునకు 15 దేశాల్లో 45 కంపెనీలు ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలో అందుబాటులో ఉన్న నిపుణులు, ఐటి పరిశ్రమ, ముఖ్యంగా కనెక్టివిటీ సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఎంపిక చేసుకున్నట్టు కెడిఎక్స్- ఎరాయిస్ ఎపికా జాయింట్ గ్రూప్ భాగస్వామ్య సంస్థ తెలిపింది. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటి పార్కులు, ఐటి సెజ్‌లు తమ భవిష్యత్తు పెట్టుబడులకు ఊతం ఇస్తాయని సంస్థ తెలిపింది. కళ్లద్దాలు అవసరం లేని 3డి తెరలు, మొబైల్ ఫోన్లు, టీవి వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరాలను తెలంగాణలో తయారు చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఐటి మంత్రి కెటిఆర్ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్, గేమింగ్ కంటెంట్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వల్ల అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే క్రమంలో కెడిఎక్స్ తెలంగాణపై ఆసక్తి చూపినట్టు కెటిఆర్ తెలిపారు. కంపెనీకి కావలసిన వౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తోందని, దేశంలోనే అత్యుత్తమ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. వినోద పరిశ్రమ కోసం గేమింగ్ సిటీ త్వరలో ప్రారంభం కాబోతుందని చెప్పారు. దేశంలో రెండవ అతిపెద్ద సినిమా పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రం అని తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి 3డి తెరతో మొబైల్ తయారు చేస్తున్న కెడిఎక్స్ ప్రతినిధులు తమ మొబైల్ ఫోన్ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాకముందే కెటిఆర్‌కు బహూకరించారు. కెడిఎక్స్ మొబైల్‌ను చూసిన కెటిఆర్ ఇది విజయవంతమవుతుందని, ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే కెడిఎక్స్ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో టిఎస్ ఐఐసి ఎండి వెంటాక్ నర్సింహారెడ్డి, ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.

chitram...
తమ కంపెనీ తయారు చేసిన త్రీడి మొబైల్ ఫోన్‌ను
కెటిఆర్‌కు చూపుతున్న ఆ కంపెనీ ప్రతినిధులు