తెలంగాణ

రాజన్న కోవెలలో రాములోరి పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఏప్రిల్ 15: కరీంనగర్ జిల్లాలోని హరిహరక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఉదయం 11.45 గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు. నునుసిగ్గుల మొలక అయిన సీతమ్మ నొసటన కల్యాణ బొట్టు, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టకుని వేములవాడ నగర గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు కళ్యాణానికి ముందు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి సీతమ్మపెళ్లికూతురైయింది. ఆమెకు ఏ మాత్రం తగ్గకుండా రామయ్య కూడా అదే రీతిలో సర్వాభరణభూషితుడయ్యాడు. కల్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్ళంతా కళ్లు చేసుకొని కల్యాణవేడుకను తిలకించారు.
జీలకర్ర, బెల్లం, మాంగల్యధారణ ఘడియల కోసం భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అనుకున్న సమయం రానే వచ్చింది. భక్తుల జయజయధ్వనుల మధ్య మూడు లక్షల మంది భక్తజనుల సమక్షంలో అభిజిత్‌లగ్నంలో సీతమ్మను రామయ్య వైభవోపేతంగా పరిణయమాడాడు. ఒకవైపు స్వామివారివార్ల దివ్యకల్యాణ తంతు ఇలా జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర, బెల్లం పెట్టుకుని శూలాలు తిప్పుతూ శివుడిని వివాహం జరుపుకున్నారు. సీతారాముల ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివపార్వతులు వానజల్లులాగా అక్షింతలను చల్లుకున్నారు. దాదాపు మూడు లక్షలమంది భక్తులు దివ్యకల్యాణాన్ని తిలకించారు. శ్రీసీతారాముల కళ్యాణానికి కన్యాదాతలుగా కరుణశ్రీ విజయసారధి దంపతులు వ్యవహరించగా, ఇవో రాజేశ్వర్, ఆర్డీవో భిక్షానాయక్, సిఐ శ్రీనివాస్ తదితరులు కల్యాణోత్స వేడుకలలో పాల్గొన్నారు.