తెలంగాణ

రాకపోకలకు సిద్ధమైన ‘త్రివేణి’ వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, ఏప్రిల్ 15: గోదావరి నదీ, ప్రాణహిత, అంతర్వాహిని మూడు నదుల (త్రివేణి ) సంగమ స్థానమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి (త్రినేత్ర)కు నిలయమైన కాళేశ్వరంనకు సమీపంలోని కనె్నపల్లి మెట్టుపల్లి వద్ద తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ (త్రిరాష్ట్ర)లకు వారధిగా నిర్మిస్తున్న వంతెన పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మూడేళ్ళలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ముందే పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ. భూ సమస్యలతో సతమతమవుతూ, అనేక అవరోధాలను ఎదుర్కొని, రానున్న నెలలోనే అంతర్రాష్ట్ర వారధిపై రాకపోకలను సాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. మూడున్నర ఎకరాల భూ సేకరణ సమస్యతో కొనసా..గుతున్న మూడు రాష్ట్రాల వంతెన నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఎంచక్కా పనులు చకాచకా సాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
గోదావరి నది, ప్రాణహిత, ఇంద్రావతి నదుల తీర ప్రాంతంలో వామపక్ష, తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉండడంతో సమీకృత కార్యాచరణ ప్రణాళిక (ఐఏపి) పథకం కింద అంతర్రాష్ట్ర వారధిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు అనువైన ప్రాంతంగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కనె్నపల్లి మెట్టుపల్లి వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మించాలని సంకల్పించింది. 2011 ఆగస్టులో అంతర్రాష్ట్ర వంతెనకు మంజూరు లభించినా.., నిర్మాణ పనులు మాత్రం 2013లో ప్రారంభమయ్యాయి. 242 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన వంతెనను 2016 ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.