తెలంగాణ

ఇఎఫ్‌ఎల్ వర్శిటీలో దళిత విద్యార్థి బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దళిత విద్యార్ధులపై వివక్షతో యూనివర్శిటీలు భగ్గుమంటున్న సమయంలో హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్ వర్శిటీ)లో ఒక దళిత విద్యార్ధిని బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. వర్శిటీ పాలకుల నిర్ణయంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమంటున్నాయి. చదువుపూర్తయిన తర్వాత కూడా ఆ విద్యార్ధి యూనివర్శిటీలోకి వచ్చి విద్యార్ధుల్లో ఉద్యమాలు రెచ్చగొడుతున్నందునే తాము ఆయనపై ఆంక్షలు విధించామని, బహిష్కరణ జరగలేదని వర్శిటీ పాలకులు చెబుతున్నారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వివాదం, నిన్న ఢిల్లీ జెఎన్‌యులో కన్హయ్య కుమార్ వివాదం నుండి ఇంకా తేరుకోక ముందే ఇఎఫ్‌ఎల్ యూనివర్శిటీలో కునాల్ దుగ్గల్ అనే పిహెచ్‌డి విద్యార్ధి బహిష్కరణ తీవ్ర సంచలనం రేపుతోంది. హెచ్‌సియు వివాదం దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఇఎఫ్‌ఎల్ వర్శిటీ అధికారులు మరో ఘర్షణకు తెరతీయడంపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబేద్కర్ జయంతి రోజున యూనివర్శిటీలోకి వచ్చిన కునాల్ దుగ్గల్ జాతి వివక్షపై ఉపన్యిసిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను గేట్ వద్దకు తీసుకువచ్చి బయటకు పంపించారు. యూనివర్శిటీలోకి రావాలంటే ప్రోక్టర్ ప్రకాష్ కోన అనుమతి తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బంది కునాల్‌కు వివరించారు. అయితే తన పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఆయన ఉస్మానియా పోలీసు స్టేషన్‌లో ప్రోక్టర్‌పై కేసు పెట్టారని తెలిసింది. కునాల్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారని పేర్కొంటూ యూనివర్శిటీ అధికారులు సైతం కునాల్‌పై మరో కేసు పెట్టారు. యూనివర్శిటీ విసి ఆదేశాలతో తాము ఆంక్షలు విధించామని గత ఏడాదే ఆయన చదువు పూర్తయిందని, పిహెచ్.డి థీసిస్ సైతం సమర్పించారని, ఆయన చదువు పూర్తయినందున ఆంక్షలు విధించాల్సి వచ్చిందని యూనివర్శిటీ సిబ్బంది చెబుతున్నారు. క్యాంపస్‌లోకి వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టడం, ఉద్యమాలు, ఘర్షణలకు తావిచ్చేలా వ్యవహరించడం వల్లనే విసి ఆదేశాల మేరకు ఆయనపై ఆంక్షలు విధించామని ప్రోక్టర్ ప్రకాష్ కోన చెప్పారు. కునాల్ వాదన ప్రకారం వర్శిటీ ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటైన వేదికపై ఒక పాట పాడిన అతను కీలక ప్రసంగం చేశాడు, అతడి ప్రసంగం పూర్తికాగానే అక్కడకొచ్చిన సెక్యూరిటీ గార్డులు బలవంతంగా వేదిక కిందకు ఈడ్చేసి చీఫ్ సెక్యూరిటీ అధికారి వద్దకు లాక్కుపోయారు. కారణం ఏమీ చెప్పకుండానే అతడిని క్యాంపస్ నుండి బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా హెచ్‌సియు రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో కునాల్ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇఫ్లూలో ఉంటూ హెచ్‌సియులో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్టు స్థానిక సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు వాటిని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ సునైనా సింగ్ నిరాకరించారు.
ని చేరుకుంటుందని తెలిపింది.

బీడీ కంపెనీల అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి
సిఎం కెసిఆర్‌కు సిపిఎం నేత తమ్మినేని డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: బీడీ కంపెనీల అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిఎంకు లేఖ రాశారు. బీడి కట్టలపై 40 శాతం ఉన్న క్యాన్సర్ గర్తును 85 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బీడీ, సిగార్ చట్టానికి 727 సవరణ చేయడాన్ని నిరసిస్తూ బీడీ పరిశ్రమల యాజమాన్యాలు ఏప్రిల్ 1 నుంచి లాకౌట్‌ను ప్రకటించాయని తెలిపారు. దీని వల్ల తెలంగాణ జిల్లాల్లో లక్షలాది మంది బీడీ కార్మికులు రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కట్టలపై క్యాన్సర్ గుర్తును ప్రస్తుతం ఉన్న 40 శాతానికే పరిమితం చేసే విధంగా కేంద్రాన్ని కోరుతూ ఒత్తిడి తీసుకురావాలని, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వీరభద్రం కోరారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయని, ఈ జిల్లాల్లోనే అధిక సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారని సిఎంకు ఆ లేఖలో వివరించారు. తక్షణమే జోక్యం చేసుకుని కార్మికుల ఉపాధిని కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు.
రీ డిజైనింగ్
బాగుంది
నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావు కితాబు
మంత్రి హరీశ్‌రావుతో భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: నీటిపారుదల రంగంలో నిపుణులు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సాగునీటి రంగం నిపుణుడు టి హనుమంతరావుతో హరీశ్‌రావు శుక్రవారం సమావేశం అయి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఎందుకు చేసిందీ హరీశ్‌రావు వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హనుమంతరావు అభినందించారు. సాగునీటి రంగంలో హనుమంతరావుకు అపారమైన అనుభవం ఉందని, ప్రభుత్వ ఆలోచనలతో ఏకీభవించారని మంత్రి తెలిపారు. విపక్షాలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో హనుమంతరావు పలు అంశాలు ప్రస్తావించారు. దాంతో మంత్రి హరీశ్ శుక్రవారం ఆయన్ని కలిశారు. ప్రాజెక్టులపై హనుమంతరావు అభిప్రాయాలను హరీశ్‌రావు తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ చక్కటి కార్యక్రమమని హనుమంతరావు అభినందించారు. ఈసందర్భంగా చెరువుల్లో నీటి నిలువ ఎక్కువగా ఉండే విధంగా, మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సూచనలు, సలహాలను మంత్రికి ఆయన వివరించారు.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత విపక్షాలు మేమూ ఇస్తామని స్పందించాయి. ఈ మేరకు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరిగింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో పాల్గొని సందేహాలను వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల గురించి సవివరంగా మాట్లాడిన హనుమంతరావు తమ్మిడిహట్టి ప్రాజెక్టును 142 మీటర్లకు పరిమితం చేయడాన్ని సమర్ధించారు. 152 మీటర్ల ఎత్తయినా, 142 మీటర్ల ఎత్తయినా నీటి తరలింపుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ప్రాణహిత నదిలో తమ్మిడిహెట్టి వద్ద 110 టిఎంసిల నీటి లభ్యత ఉంటుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో నీటి పారుదల రంగం సలహాదారుగా పని చేసిన హనుమంతరావుకు ఈ రంగంలో అపారమైన అనుభవం ఉందని, అలాంటి వారి సలహాలను పాటిస్తామని హరీశ్‌రావు తెలిపారు.