తెలంగాణ

కులవృత్తుల బలోపేతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోందని మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఆదివారం రొయ్య పిల్లలను విడుదల చేసిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తరువాత కులవృత్తిదారుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసి విజయవంతం అయ్యామన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్‌లో ఎల్లప్పుడూ నీళ్లు నిల్వ ఉండేలా చూస్తామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 100 శాతం రాయితీతో చేపపిల్లలు, రొయ్యలు కూడా అందిస్తోందని, వారు మార్కెటింగ్ చేసుకునేందుకు అవసరమయ్యే వాహనాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోనే ఏడు చెరువుల్లో 318 లక్షల చేపపిల్లలు, దాదాపు 7లక్షల రొయ్యపిల్లలను పెంచుతున్నామన్నారు. వీటిని మార్కెటింగ్ చేసేందుకు అనువైన వాతావరణాన్ని కూడా కల్పిస్తామన్నారు. మూగజీవాలను రక్షించేందుకు మొబైల్ వాహనాలను డాక్టర్లకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మేకలు, గొర్రెల పెంపకందారులకు గొర్రెలు, డ్వాక్రా మహిళలకు బర్రెలను అందిస్తున్నామన్నారు. అలాగే అన్ని కులవృత్తిదారులకు ఉపాధికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామన్నారు. పాలేరులో మత్స్య పరిశోధన కేంద్రం భవన నిర్మాణానికి 85లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాలలను ఆధునీకరిస్తున్నామని, గోపాలమిత్ర సేవకులకు వేతనాలు పెంచామని, పశు ఆరోగ్య సంరక్షణ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 1962 అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా 6లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని మంత్రులు తలసాని, పువ్వాడ వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, కలెక్టర్ కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ. వేదికపై మంత్రి తలసాని