తెలంగాణ

బావిలో పడిన మొసలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, డిసెంబర్ 9: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్‌లో ఓ మొసలి బావిలో పడింది. దీనిని గమనించిన స్థానికులు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు బుధవారం బావిని సందర్శించి, మొసలిని బయటికి తీశారు. మొసలిని మంజీరా డ్యాంలో వదిలిపెట్టనున్నట్లు వారు తెలిపారు. మొసలిని చూసేందుకు స్థానికులు చాలా ఉత్సాహాన్ని చూపారు. ఇదిలాఉండగా ఇదివరకే ఒక మొసలిని కొత్తూర్(బి) గ్రామంలో నారింజ బేరేజీ పక్క పొలంలో నుంచి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారులు తీసుకెళ్లగా మరొక్కటి మిర్జాపూర్ (బి)లో కల్వర్టులో ఇరుక్కుపోయింది. ఇలా రెండు మొసళ్లు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చేరుకోగా మరొక్కటి అల్గోల్‌నుంచి వెళ్లింది. నారింజ బ్యారేజీలో నీరులేకపోవడంతోనే అవి ఇలా బయిటికొస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

అల్గోల్‌లో బావిలోపడ్డ మొసలిని బయటికి తీసి బంధిస్తున్న వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 9: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఖమ్మం జిల్లాలో పోటీ తీవ్రంగా ఉండటం గమనార్హం.
అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్ పోటీలో ఉన్నారు. పువ్వాడ నాగేశ్వరరావుకు తెలుగుదేశం, కాంగ్రె స్ పార్టీలు మద్దతిస్తున్నాయి. కా గా జిల్లాలో 724మంది ఓటర్లు ఉండగా ఎవరికి వారు గెలుపు తమదే అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు మద్దతిచ్చే వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. టిఆర్‌ఎస్ హైదరాబాద్‌లోని మేడ్చల్‌రోడ్డులో ఉన్న ఓ రిసార్ట్స్‌లో క్యాంప్ ఏర్పాటు చేయగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా నూజివీడు వద్ద క్యాంపు ఏర్పాటు చేసింది. ఇక వామపక్ష పార్టీలు కూడా క్యాంపులకు తమ ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పార్టీగా ఉండి సుమారు 40 ఓట్లు కలిగిన సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ఎవరికి వారు మండల స్థాయిలోనే ఎంపిటిసి, జడ్పీటిసి, వార్డు మెంబర్లతో లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. కాగా ఓటర్లను మభ్యపెట్టేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు ఉన్నా వారు మాత్రం ప్రత్యర్థి పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఎవరికి వారే ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుండటం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తుండటం గమనార్హం. ఒకరి క్యాంపులో ఉన్న వారితో ప్రత్య ర్థి పార్టీ నేతలు మాట్లాడుతూనే లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిగే రోజే ఓటర్లను జిల్లాకు తరలించనున్నట్లు ఆయా పార్టీల నేతలు అనధికారికంగా వెల్లడించారు.