తెలంగాణ

స్నేక్ గ్యాంగ్‌కు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: హైదరాబాద్ నగర శివారులోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అకృత్యాలకు పాల్పడ్డారన్న నేరంపై 8మంది స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. ఏ1 నుంచి ఏ7 నిందితులకు జీవిత ఖైదు విధించగా, ఏ8 నిందితుడు ఇంతకు ముందే 22 నెలల శిక్ష అనుభవించినందున అతనికి 20 నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులు నగర శివారులో 37 మంది యువతులను పాములతో బెదిరించి ఆకృత్యాలకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 9మంది నిందితులను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు కట్టుదిట్టమైన భద్రతతో తీసుకొచ్చారు. స్నేక్ గ్యాంగ్‌పై జిల్లా కోర్టు విచారణ జరిపి ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించి 9వ నిందితునిగా ఉన్న సలాం హండిల్‌ను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచారం జరిగినట్టు సరైన ఆధారాలు లేకపోవడంతో అతనిపై వున్న కేసును కూడా కోర్టు కొట్టివేసిన విషయం విధితమే. కాగా స్నేక్ గ్యాంగ్ దోషులకు బుధవారం శిక్ష ఖరారు చేయనున్నట్టు కోర్టు పేర్కొంది. ఈమేరకు ఫైసల్ దయాని, ఖాదర్ బరాక్, తయ్యబ్ అస్లం, మహమ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రాహింలకు కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. ఏడుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ, 8వ నిందితుడు అలీ ఒబారక్‌కు 20 నెలల జైలు శిక్ష విధించింది.
సైబరాబాద్ పరిధిలో యువతులపై ఆకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడడం పట్ల సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. నగర శివారులో ఆకృత్యాలకు పాల్పడే వారికి, రౌడీలు, భూకబ్జాదారులకూ ఇలాంటి శిక్షే పడుతుందని హెచ్చరించారు. స్నేక్ గ్యాంగ్‌కు జీవితఖైదు పడడం నేర న్యాయ వ్యవస్థ సాధించిన విజయంగా ఆనంద్ అభివర్ణించారు. 14 మే 2014లో జరిగిన అభయ అత్యాచార దోషులకు 20ఏళ్లు జైలుశిక్ష పడటంవల్ల మహిళలకు రక్షణ చర్యలు పెరిగాయని, తాజాగా స్నేక్ గ్యాంగ్‌పై వెలువడిన తీర్పు మహిళల భద్రతకు మరింత చర్యలు తీసుకునేలా దోహదపడుతుందన్నారు. ఇదిలావుండగా బాధితురాలు మాట్లాడక పోవడంతోనే స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం అభియోగాలు వీగిపోయాయని, అయితే దానిపై అప్పీలుకు వెళ్ళేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వివరించారు. నిందితులకు శిక్ష పడేందుకు కష్టపడ్డ పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అభినందనలు తెలిపారు.

చిత్రం... స్నేక్ గ్యాంగ్ సభ్యులను జైలుకు తరలిస్తున్న దృశ్యం