తెలంగాణ

షాక్ తప్పదు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టాల్లో పడిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి వినియోగదారులపై వెయ్య కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. పాలేరు ఉప ఎన్నిక ముందు టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించడం ఎందుకులే అని ఆగిన ప్రభుత్వం, నేటితో ఉప ఎన్నిక ముగుస్తుండటంతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. అయతే విద్యుత్ విషయంలో ఇప్పటికే జనామోదం పొందిన ప్రభుత్వం, అపవాదు రాకుండా కార్యం పూర్తి చేయాలన్న తలంపుతో కనిపిస్తోంది.

హైదరాబాద్, మే 15: తెలంగాణలో కొత్త విద్యుత్ టారిఫ్ ఆర్డర్‌ను విద్యుత్ నియంత్రణ మండలి ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రెండు డిస్కాంలు రూ.8789 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, రూ.1958 కోట్ల మేర విద్యుత్ టారిఫ్ పెంచేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనలపై మండలి బహిరంగ విచారణను పూర్తి చేసింది. గత నెల చివరి వారంలో టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటిస్తారని భావించారు. దాదాపు రూ.1000 కోట్లు, ఆ లోపల మాత్రమే విద్యుత్ చార్జీలను పెంచనున్నట్టు తెలిసింది. 70శాతం మంది గృహ విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం పడకుండా కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. పాలేరు ఉప ఎన్నిక ఉన్నందున కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించలేదు. సాధారణంగా డిస్కాంలు సకాలంలో టారిఫ్ ప్రతిపాదనలు ఇస్తే మార్చిలోపల విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ పూర్తి చేసి నెలాఖరుకే కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి రావాలి. కానీ అనేక కారణాల వల్ల రెండు నెలలు ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో జూన్ 1నుంచి సవరించిన విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.4500 కోట్ల వరకు సబ్సిడీ భరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అంతర్గత సామర్థ్యం ద్వారా రూ.3వేల కోట్లను సేకరించాలని విద్యుత్ నియంత్రణ మండలి కోరనున్నట్టు సమాచారం. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.816 కోట్ల వరకు విద్యుత్ చార్జీలను వడ్డించింది. ఈసారి అంతకంటే ఎక్కువగానే విద్యుత్ చార్జీలను పెంచే అవకాశం కనపడుతోంది. తెలంగాణ డిస్కాంలు ప్రతిపాదనల్లో రూ30,207 కోట్ల రెవెన్యూ అవసరమని, టారిఫ్ వల్ల రూ.21418 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తుంది. దీనివల్ల రూ.8789 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని, భర్తీ చేసేందుకు రూ.1958 కోట్ల టారిఫ్‌ను పెంచాలని డిస్కాంలు కోరాయి. పైగా విద్యుత్ కొరత నుంచి బయటపడేందుకు దీర్ఘకాలిక, మధ్యకాలిక, పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా దాదాపు రూ.700 కోట్ల విద్యుత్‌ను డిస్కాంలు కొనుగోలు చేశాయి. ఒక యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ.6.44 పైసలు ఖర్చవుతోందని, కాని రెవెన్యూ యూనిట్‌కు రూ.4.56 పైసలు వస్తోందని డిస్కాంలు పేర్కొన్నాయి. ఒక యూనిట్‌పై రెవెన్యూ లోటు రూ.1.88 పైసలు ఉంటోంది. ఈ ఏడాదికి రూ.54,884 ఎంయు విద్యుత్ అవసరమని, రాష్ట్రంలో లభ్యతలో ఉన్న విద్యుత్, విద్యుత్ కొనుగోళ్ల ద్వారా 57222 ఎంయు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని డిస్కాంలు తెలిపాయి.
రాష్ట్రంలో 1.19 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 86 లక్షల మంది వినియోగదారుల్లో 60 లక్షల మందికి విద్యుత్ చార్జీలను పెంచకుండా, మిగిలిన వర్గాలపై టారిఫ్ పెంచుతామని డిస్కాంలు ప్రతిపాదించాయి. మొత్తంపై యూనిట్‌కు 42 పైసలు వరకూ పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. డిస్కాంలు ప్రతిపాదించిన అంశాలను మండలి ఆమోదించినట్లయితే 9.14 శాతం మేర విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని రూ.4500 కోట్లను భరిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్ధితుల దృష్ట్యా మరో ఐదు వందల కోట్ల సబ్సిడీని భరించి ఆ మేరకు విద్యుత్ టారిఫ్ తగ్గించాలని ప్రభుత్వం మండలిని కోరినట్టు సమాచారం.