తెలంగాణ

రూపాయికే నల్లా కనెక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు కేవలం రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం నల్లా కనెక్షన్‌కు రూ.1200 వసూలు చేస్తుండగా, దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు రూ.200 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇకనుంచి రూ.200కు బదులుగా నామమాత్రంగా రూపాయి మాత్రమే వసూలు చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం జీవో 372 జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పేదల సంక్షేమానికి చేపట్టనున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారిని గుర్తించేందుకు ఆసరా, ఆహార భద్రతా కార్డుల కోసం ఖరారు చేసిన విధంగా వార్షిక ఆదాయం రూ.2 లక్షలు ఉన్న వారికి మాత్రమే రూపాయికి నల్లా కనెక్షన్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారి నుంచి వసూలు చేసే నల్లా కనెక్షన్ రుసుం తగ్గించడంతో ఆ మొత్తాన్ని యుఎల్‌బికి కేటాయించే నిధుల నుంచి రాబట్టుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.