తెలంగాణ

ఐదెకరాల వరకూ రుసుంలేని రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: సాదా కాగితాలపై జరిగిన భూముల అమ్మకాలను (సాదా బైనామా) అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియపై రెనిన్యూ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. సాదా బైనామాల ఉచిత రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15వరకు గడువు విధించింది. సాదా కాగితాలపై జరిగిన భూ లావాదేవీలకు జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్‌ను ఖరారు చేశారు. ఆలోగా జరిగిన అమ్మకాలకే స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో ఉచిత రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు రెవిన్యూ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ వెసులుబాటు కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుందని, ఐదెకరాల వరకు మాత్రమే దీన్ని పరిమితం చేసినట్టు రెవిన్యూ శాఖ పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసిన భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయనున్నట్టు పేర్కొంది. సాదా బైనామాల క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ ఆథారిటీ (హెచ్‌ఎండిఎ), కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా), ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలోని భూములను మినహాయించినట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.