తెలంగాణ

అర ఎకరమే..నెలకు 30 వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: సేద్యంలో యాజమాన్యం, నిర్వహణ సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా ఉంటే కొద్దిపాటి భూమిలో కూడా మంచి పంటలు పండించి, కుటుంబపోషణకు అవసరమైన డబ్బు సంపాదించవచ్చని నిరూపించాడు సత్యారెడ్డి అనే ఒక సామాన్యరైతు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని అల్మాస్‌గుడాకు చెందిన రామిడి సత్తిరెడ్డి (85) అనేక దశాబ్దాలుగా సేద్యం చేస్తున్నాడు. ఈ రైతుకు ఉన్న పొలం కేవలం అర ఎకరమే. పొలంలో బోర్‌వెల్ వేసుకున్నాడు. అర ఎకరానికి సరిపోను సాగునీరు లభిస్తోంది. నీరు ఎక్కువ అవసరం లేని పాలకూర, చుక్కకూర, పుంటికూర, కొత్తిమీర, పుదీన తదితర ఆకుకూరలు పండిస్తున్నాడు. మార్కెట్లో విత్తనాలు తీసుకువచ్చి విత్తుతాడు. ఉన్న అర ఎకరం భూమిని కొన్ని విభాగాలుగా విభజించి, వేర్వేరు రకాల ఆకుకూరలు వేస్తాడు. నెలరోజుల్లోగా ఇవి కోతకు వస్తాయి. పాలకూర, చుక్కకూరలు ఒక సారి వేస్తే నాలుగైదు పర్యాయాలు పంట చేతికి వస్తుంది.
ఉదయం ఆరుగంటలకు మొదలయ్యే పొలంపనులు తొమ్మిది, పది గంటలకు పూర్తవుతాయి. ఇద్దరు ముగ్గురు మహిళాకూలీల చేత ఆకుకూరలు కోయిస్తాడు. వీటిని గంప ల్లో, సంచుల్లో నింపి సమీపంలోని వివిధ కాలనీలకు సైకిల్‌పై తీసుకువెళ్లి అమ్ముతాడు. మధ్యాహ్నం వరకు అమ్మకం పని పూర్తవుతుంది. రోజూ వెయ్యిరూపాయల నుండి 1500 రూపాయల వరకు వస్తాయి. ఖర్చులన్నీ పోనూ నెలకు 25 వేల నుండి 30 వేల రూపాయల వరకు మిగులుతాయని సత్తిరెడ్డి తెలిపారు. ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఆకుకూరలు పండించేందుకు రసాయన ఎరువులను వాడటం లేదని, సేంద్రీయ ఎరువులే వాడతానని చెప్పాడు. పంటల కోసం బ్యాంకుకు ఏనాడూ వెళ్లలేదని, అలాంటి అవసరం కూడా రాలేదన్నాడు. సాయం కావాలంటూ ప్రభుత్వం దగ్గరకు కూడా ఏనాడూ పోలేదని వివరించాడు. వచ్చే ఆదాయం నుండే ఇల్లు కూడా కట్టుకున్నానని, భార్య నర్సమ్మ (76) పొలం పనుల్లో సహకరిస్తుందని వివరించాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడని, కూతుళ్ల పెళ్లి చేశానని, కొడుకు వ్యాపారం చేసుకుంటున్నాడన్నారు. రైతులు ఎవరైనా కాస్తకష్టపడితే, సమర్థవంత నిర్వహణ ఉంటే మంచి ఆదాయం లభిస్తుందని వివరించాడు. భూమిని నమ్మిన రైతు ఏనాడూ చెడిపోడని, కష్టపడే తత్త్వం ఉండాలని, చిత్తశుద్ది కూడా ఉండాలని అంటున్నాడు సత్తిరెడ్డి. ఐదు, పది ఎకరాలు ఉన్న రైతులు కూడా అప్పుల్లో కూరుకుపోయి, బాధపడుతున్న సమయంలో సత్తిరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడనడంలో ఎలాం టి సందేహం లేదు.

వ్యవసాయాదాయంతో రైతు రామిడి సత్తిరెడ్డి నిర్మించుకున్న ఇల్లు
ఆకు కూరల అమ్మకంలో, సేద్యం పనుల్లో నిమగ్నమైన సత్తిరెడ్డి