తెలంగాణ

అభివృద్ధికి ఆర్థిక ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ నగరం సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఆర్థిక సహకారం అందించేందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీసింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) ముందుకొచ్చింది. సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కంపెనీ చైర్మన్ ప్రదీప్ పూరి, వైస్ చైర్మన్ హరీష్ శంకరన్ తదితరులు సిఎం కె చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందన్నారు. ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంతోపాటు పరిశ్రమల స్థాపనకు అనువుగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు సురక్షితమైన మంచినీరు, మెరుగైన మురుగునీటి వ్యవస్థను తయారుచేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని అన్నారు. నగరంలో వరద కాల్వల నిర్వహణ, మూసీ ప్రక్షాళన, వౌలిక సదుపాయాల కల్పన, నగరానికి చుట్టుపక్కలున్న ప్రాంతాలతో అనుసంధానం తదితర అంశాలపై దృష్టి సారించినట్టు సిఎం వివరించారు. వీటికి తమ ప్రభుత్వం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ నుంచి ఆర్థిక సహకారాన్ని కోరుతోందన్నారు. తమ పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యంత ఉత్తమంగా ఉండటంతో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం 3000 ఎకరాలు కేటాయిస్తున్నామని, జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్ తదితర యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. వీటికీ ఆర్థిక సహకారం అందించాలని సిఎం కోరగా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ చైర్మన్ ప్రదీప్ పూరి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే నెలలో మరోసారి సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకునే ఒప్పందానికి విధి విధానాలు ఖరారు చేసుకుందామని సిఎం కెసిఆర్ సూచించారు. సమావేశంలో సిఎస్ రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్, సిఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.