తెలంగాణ

‘భరోన’తో మహిళకు భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ‘్భరోస’ పేరిట ఓ వినూత్న పథకాన్ని రూపొందించింది. నెల రోజుల క్రితం రాజధాని నగరంలోని హాకా భవన్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 23మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ కేంద్రంలో న్యాయ సలహా, కౌనె్సలింగ్, గృహ హింసకు సంబంధించి కేసులను పరిష్కరిస్తారు. మహిళా కేసుల పరిష్కారంలో సత్ఫలితాలిస్తున్న భరోసాను మరింత పటిష్ఠ పరచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అధికారిణి స్వాతి లక్రా తెలిపారు. నెల రోజుల్లో మొత్తం 230 కేసులు నమోదయ్యాయని, వీటిలో గృహ హింస కేసులో ఎక్కువగా ఉన్నాయన్నారు. మహిళలు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా కేసులు పెట్టేందుకు భరోసా కేంద్రానికి వస్తున్నారని, భర్తల వేధింపులే కాకుండా, ఈవ్‌టీజింగ్, మానసిక వేధింపులు, శారీరక వేధింపులు, లైంగిక దాడులు, కుటుంబ కలహాలు వంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కేసులనుబట్టి తమ సిబ్బంది కౌనె్సలింగ్ నిర్వహించడం, న్యాయ సలహా అందించడం జరుగుతుందని స్వాతిలక్రా తెలిపారు. భరోసాతో మహిళల్లో ఆత్మస్థయిర్యం పెరిగిందని, బాధిత మహిళలు నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేస్తూ న్యాయ పరిష్కారాన్ని పొందుతున్నారని స్వాతిలక్రా వివరించారు. మహిళలకు రక్షణగా ఉండం కోసం భరోసా యునైటెడ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో ఎంఓయు కుదుర్చుకున్నామని తద్వారా కేసుల పరిష్కారం సులభతరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
24న న్యాయవాదుల
చలో హైదరాబాద్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, న్యాయాధికారుల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ తెలంగాణ అడ్వకేటు జెఎసి 24న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కోర్టు విధులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
అదేవిధంగా ఈ నెల 20న నాంపల్లి కోర్టులో ఘంటారావం పేరిట ఆందోళన కార్యక్రమం, మంగళవారం మానవహారం ఉంటుందని పేర్కొన్నారు.