తెలంగాణ

ఆరుతడి పంటలకు 50 శాతం రాయితీతో విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు 50శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత దృష్ట్యా రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. బోరుబావుల కింద వరి పంటకు బదులు ఆరు తడి పంటలు వేరుశనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు వంటి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆరుతడి పంటలకు 50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. ఇంతకు ముందు వేరుశనగ విత్తనాలకు 50 శాతం రాయితీ ఇచ్చారు.