తెలంగాణ

న్యాయవాది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 26: కారులోనే కాలి బూడిదైన న్యాయవాది సంఘటన కీసరలో సంచలనం రేకెత్తించింది. రంగారెడ్డి జిల్లా కీసరలో ఆదివారం ఉదయం కొందరు మార్నింగ్ వాక్‌కు వెళుతుండగా మల్లన్న గుడి సమీపంలో కాలి బూడిదైన కారు కనిపించింది. దగ్గరికెళ్లి చూసేసరికి కారులో ఒక వ్యక్తి కాలి బూడిదైనట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ గురువారెడ్డి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను పిలిపించారు. శనివారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని సిఐ గురువారెడ్డి అభిప్రాయపడ్డారు. కారులోని గ్యాస్ సిలండర్, కారు నెంబర్ ఆధారంగా ఆ కారు ఏఎస్ రావునగర్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన న్యాయవాది ఆవుల తిరుమల ఉదయ్‌కుమార్ (47)గా గుర్తించారు. వెంటనే ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. భార్య జగదీశ్వరి, కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, కాలిపోయిన కారు ఆధారంగా చనిపోయింది ఉదయ్‌కుమారే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయింది ఉదయ్‌కుమారా? లేక వేరే ఎవరైనానా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు.
భూవివాదాలే కారణమా?
కారులోనే కాలి బూడిదైనట్టు భావిస్తున్న ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు మిలటరీ రిటైర్డ్ ఉద్యోగి. జవహర్‌నగర్ సర్వే నెంబరు 700లో ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చింది. భూమి విషయంలో గత కొనేళ్లుగా పక్క్భూమి యజమానితో వివాదాలున్నాయి. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహానికి సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. డిఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతుడు ఎవరనేది నిర్ధారణ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఉదయ్‌కుమార్ భార్య జగదీశ్వరి ఆదివారం ఉదయం కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తన భర్త శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి డిసిపి రాంచందర్ రావు, ఏసిపి రఫీక్, సిఐ గురువారెడ్డి సందర్శించి వివరాలను సేకరించారు.

చిత్రం... కారు దగ్ధమైన ప్రాంతంలో వివరాలు సేకరిస్తున్న డిసిపి రామచందర్‌రావు. ఇన్‌సెట్‌లో మృతుడిగా భావిస్తున్న ఉదయ్‌కుమార్ (ఫైల్‌ఫొటో)