తెలంగాణ

పీఠాధిపతుల వద్దకు సదావర్తి పంచాయితీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సదావర్తి సత్రం భూముల కొనుగోల్‌మాల్‌పై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ కార్డును ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువయ్యే తమిళనాడులోని సదావర్తి సత్రం దేవాలయ భూముల పరిరక్షణకు నడుం బిగించాలని కోరుతూ పీఠాథిపతులు, మఠాథిపతులకు లేఖలు రాయాలని నిర్ణయించుకుంది.
సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కొనుగోలు చేసిన అధికారపార్టీ ప్రముఖులపై ఆరోపణలు కురిపిస్తోన్న వైసీపీ, ఇప్పుడు దానిని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ దానిని ఖండించాలన్న నినాదంతో అడుగులు వేయనుంది. అందులో భాగంగా, ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో తమిళనాడులోని తారంబూరుకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక వచ్చే నెల 4న పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ఇవ్వనుంది. ఆ తర్వాత కార్యాచరణపై కసరత్తు చేపట్టింది. ఆ తరువాత దేశంలో ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాల అధిపతులకు సదావర్తి వ్యవహారంపై తాము సేకరించిన వాస్తవాలను, నివేదిక రూపంలో ఇవ్వనున్నట్లు సమాచారం. సదావర్తి సత్రం వంటి దేవాలయ భూములను బాబు ప్రభుత్వం, అడ్డగోలుగా తన వారికి అమ్ముకుంటున్న వైనాన్ని ఖండించడంతోపాటు, ఆ వ్యవహారంలో చొరవ తీసుకోవాలని లేఖ రాయనుంది. వెంటనే చొరవ చూపించకపోతే ఇదేవిధంగా దేవాలయ భూములు హారతి కర్పూరమయి, దేవాలయాలకు పూర్వీకులు ఇచ్చిన మాన్యాలు కరిగిపోతాయని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేయనుంది. ఈ వ్యవహారంలో పీఠాథిపతులు, మఠాథిపతులను ఒకేవేదిక మీదకు తీసుకువచ్చేందుకు తానే ప్రయత్నించాలా? లేక వీటిపై ఇప్పటికే పోరాటం చేస్తున్న వారితో కలసి ప్రయత్నించాలా? అన్నది జగన్‌తో భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సదావర్తి సత్రం భూముల సత్రం వేలం వ్యవహారంపై బ్రాహ్మణ యువజన ఫెడరేషన్ హైకోర్టులో కేసు వేసినందున, వారిని సమన్వయం చేసుకుని స్వాములను ఒక వేదికపైకి తీసుకురావాలా? అన్న అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. అంతే కాదు, ఈ మొత్తం వ్యవహారంపై వాస్తవంగా నెలకొన్న పరిస్థితులు, న్యాయస్థానాల రూలింగులతో కూడిన నివేదికను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ జాతీయ కార్యాలయాలకూ లేఖ రాయాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలిసింది.
స్వాములతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, వీహీచ్‌పి, బజరంగదళ్ వంటి సంస్థలు రంగంలో దిగితే.. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి కూడా చిక్కుల్లో పడి, ఈ వ్యవహారంతో తమకు సంబంధం ఉందా? లేదా? అని ప్రకటన చేయాల్సిన పరిస్థితి వస్తుందనేని వైసీపీ వ్యూహంలా కనిపిస్తోంది.