తెలంగాణ

ఆడ ఏనుగును చంపిన మదపుటేనుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, జూన్ 28: చిత్తూరు జిల్లా వి కోట మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పదేళ్ల ఆడ ఏనుగు మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. నాగిరెడ్డిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో పదేళ్ల ఆడ ఏనుగు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లుగా గుర్తించిన మృతదేహాన్ని స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఆర్‌ఓ, సిబ్బంది మృత దేహాన్ని పరిశీలించి గున్న ఏనుగు దాడివల్ల ఆడ ఏనుగు మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో 11 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి. సంబంధిత అటవీ సిబ్బంది ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించేందుకు సిబ్బందితో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం ఆడ ఏనుగు మృతి చెందడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏనుగు సంచారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు డిఆర్‌ఓ తెలిపారు.