తెలంగాణ

ఫీజులు, సీట్లు.. అంతా సీక్రెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సర్ట్ఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానున్నప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య, సీట్లు, ఫీజుల విషయం బహిరంగ పరచకుండా ప్రభుత్వం దాపరికాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణలోని దాదాపు 95 శాతం కాలేజీలు వివిధ రాజకీయ పార్టీల నేతలకు చెందినవే కావడం గమనార్హం. దాంతో ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి వస్తున్నట్టు తెలిసింది. ఇటీవల పార్టీలో చేరిన మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి ఆధ్వర్యంలోనే 25 కాలేజీలు పనిచేస్తున్నాయి. అలాగే షాదాన్ గ్రూప్ ఆధ్వర్యంలో 50 కాలేజీలు పనిచేస్తున్నాయి. మరో పక్క ఆంధ్రా మంత్రి డాక్టర్ నారాయణ గ్రూప్ కాలేజీలు, ఎమ్మెల్సీగా పనిచేస్తున్న రాజేశ్వరరెడ్డి కాలేజీలు, బిజెపికి చెందిన పలువురు నాయకులకు గ్రూప్ కాలేజీలున్నాయి. దాంతో ఏదో ఒక కాలేజీ సీట్లు తగ్గించినా, ఫీజు తగ్గించినా దానిని రాజకీయ కోణంలో వివాదాస్పదం అయ్యేలా ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది.
ప్రతి ఏటా జరిగే అనుబంధ గుర్తింపు వ్యవహారం సంవత్సరం పొడవునా కొనసాగించినట్టయితే పద్ధతి ప్రకారం జరిగేది, అడ్మిషన్లకు 20 రోజుల ముందు హడావుడి చేసి తుతు మంత్రంగా జాబితాలను ఖరారు చేయడం జెఎన్‌టియుకు అలవాటుగా మారింది. ఈసారి న్యాయస్థానాల జోక్యంతో మరింత కఠినంగా కాలేజీలను పరిశీలిస్తామని చెప్పిన యూనివర్శిటీ అధికారులు, చివరికి నేతల జోక్యంతో రాజీపడినట్టు తెలుస్తోంది. మరో పక్క ఎఎఫ్‌ఆర్‌సి అధికారులు సైతం చాలా పకడ్బందీగా రూపొందించిన నివేదికలకు, విజిలెన్స్ కమిటీలు ఇచ్చిన నివేదికలకు, మరో పక్క యూనివర్శిటీ నివేదికలకు, ఇంకో పక్క కాలేజీలు ఇచ్చిన స్వీయ అప్రైజల్ నివేదికలకు పొంతన లేదని తెలిసింది. ఒకదానికి ఒకటి భేరీజు వేసుకునే సమయం లేకపోవడంతో అధికారులు ఎలాగైనా ‘గుర్తింపు’ ప్రక్రియకు రెండు రోజుల్లో తెరదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే కాలేజీలు, సీట్లు, ఫీజుల అంశంపై ప్రాధమికంగా ఒక నివేదికను తయారుచేసిన ఎఎఫ్‌ఆర్‌సి అధికారులు, తుది నివేదికను తయారుచేసేందుకు ముందు కొన్ని కాలేజీలకు షోకాజ్‌లు జారీ చేశారు. తెలంగాణలో జూన్ 22 నుండి అడ్మిషన్ల ప్రక్రియప్రారంభం అయ్యింది. తెలంగాణలో 266 కాలేజీల్లో 1,26,468 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది తెలంగాణలో సీట్ల సంఖ్య 95000 లేదా 96 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం యూనివర్శిటీ, కానిస్టిట్యూయెంట్ కాలేజీలు 19 వరకూ ఉన్నాయి. మిగిలినవి అన్ ఎయిడెడ్ ప్రైవేటు కాలేజీలు పనిచేస్తున్నాయి. మరో పక్క ఇంజనీరింగ్‌లో రెండు మూడు బ్రాంచిలకు మాత్రమే గిరాకీ ఉండటం, మిగిలిన బ్రాంచిల వైపు విద్యార్ధులు కనె్నత్తి కూడా చూడకపోవడంతో అన్ని కాలేజీలూ ఆ రెండు మూడు బ్రాంచిలవైపు చూస్తున్నాయి. దాంతో గిరాకీ లేని బ్రాంచిలను సరెండర్ చేస్తున్నాయి.
ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏరోస్పేస్‌లపై ఎక్కువ మంది దృష్టిపడింది. ఉన్నవాటిలో బయోటెక్నాలజీ, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్, ఫార్మస్యుటికల్, ప్రింటింగ్, ఆటొమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచిలు లేదా అనుబంధ సబ్జెక్టులపై విద్యార్ధులకు ఆసక్తి తగ్గింది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (పాత చిత్రం)