తెలంగాణ

ఆర్టీసీని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.137 కోట్లు నిధులు అందించే ఏర్పాట్లు చేశామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రూ.150 కోట్ల వ్యయంతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సిఎం కెసిఆర్ అనుమతి ఇచ్చారని అన్నారు. ఆర్టీసి ఎస్సీ, ఎస్టీ సెల్ వెల్‌ఫేర్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. టిఎస్ ఆర్టీసిలో 58 వేల మంది ఉద్యోగులు ఉంటే వారిలో సగం మంది వరకు ఎస్సీ, ఎస్టీలు దాదాపు 20 వేల మంది ఉన్నారని అన్నారు. వారికి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని, అర్థరాత్రి వచ్చి తలుపుతట్టినా ఆదుకుంటానని అన్నారు. ఆర్టీసి కార్మికులు అడిగిన వెంటనే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి సిఎం కెసిఆర్ గౌరవించారని గుర్తు చేశారు. బస్‌భవన్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం, ఆర్టీసి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం వంటి అంశాలను సిఎం కెసిఆర్‌కు వివరిస్తానని మంత్రి కార్మికులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఆర్టీసిని దేశంలోనే గొప్ప సంస్థగా తీర్చిదిద్దేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్టీసిలోని దళిత, గిరిజన వర్గాల కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ రామునాయక్ అన్నారు. గత పాలకుల దుర్మార్గాలకు ఆర్టీసి బలైందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరక్టర్ జెఎండి రమణారావు, ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప, ఈడిలు నాగరాజు, రవీందర్, సంఘ నాయకులు పద్మారావు, నర్సింహులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ రజతోత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి