తెలంగాణ

‘గాంధీ’లో శిశువు అపహరణకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, హైదరాబాద్, డిసెంబర్ 16: గాంధీ ఆస్ప్రత్రిలో అప్పుడే పుట్టిన శిశువును అపహరించేందుకు ఓ మహిళ ప్రయత్నించగా ఇద్దరు ఆటోడ్రైవర్లు అడ్డుకున్నారు. ఆ మహిళను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
విశాఖపట్టణానికి చెందిన తేజ, జ్యోతి దంపతులు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. భార్య జ్యోతి ప్రసవం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తేజ తీసుకువచ్చాడు. మంగళవారం రాత్రి వైద్యులు సూచించిన మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇదంతా గమనిస్తున్న మేరీ అనే మహిళ అదే అదునుగా భావించి ఆ పసిబిడ్డను ఎత్తుకుని బయటకు వెళ్లింది. అక్కడి నుంచి బిడ్డతో సహా పారిపోయేందుకు ఆటోరిక్షా కోసం వాకబు చేస్తుంది. పసిబిడ్డను చేతుల్లో పట్టుకుని అటూ ఇటూ చూస్తున్న మేరీని అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు సద్దాం, శ్రీను గాంధీ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద గమనించారు. తాను రామచంద్రపూరం నుండి 108 అంబులెన్స్‌లో తమ్ముడి భార్య ప్రసవం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చానని మాయమాటలు చెప్పింది. ఇదంతా గమనించిన ఆటో డ్రైవర్లిద్దరూ అమెతో పాటు పసిపాపను ఆటోలో ఆసుపత్రిలోపలికి తీసుకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆసుపత్రిలోని పోలీసు ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసి అసలు విషయాన్ని పోలీసులకు వివరించారు. పొంతన లేని సమాధానం చెబుతున్న మేరీని పోలీసులు, ఆసుపత్రి అధికారులు ప్రశ్నించడంతో పాపను ఎత్తుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం బయటపడింది. ఆ తరువాత జ్యోతి, తేజ దంపతులకు బిడ్డను అప్పగించారు. సదరు మహిళపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆశా వర్కర్ల సమ్మె విరమణ

కేంద్రం సాయంతో కనీస వేతనాలు
తెలంగాణ వైద్యమంత్రి లక్ష్మారెడ్డి హామీ
తాత్కాలికంగా సమ్మె వాయిదా

హైదరాబాద్, డిసెంబర్ 16: అంగన్‌వాడి వర్కర్ల తరహాలో తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 106 రోజులుగా రాష్టవ్య్రాప్తంగా సమ్మె చేస్తున్న ఆశావర్కర్లు బుధవారం తమ సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కనీస వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీతో సమ్మెను వాయిదా వేసుకున్నట్టు ఆశావర్కర్లు ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఆశావర్కర్లతో బుధవారం వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆశావర్కర్లకు పారితోషకాన్ని చెల్లిస్తున్నామని, వాటిని పెంచడం తమ పరిధిలో లేదని మంత్రి వారికి వివరించారు. అయినప్పటికీ సమ్మె విరమించి విధుల్లో చేరితే, కేంద్రంతో ఈ అంశాన్ని చర్చించి కనీస వేతనం అయినా చెల్లించడానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మొదట సమ్మె విరమించినట్టు ప్రకటిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందని మంత్రి పెట్టిన షరతుకు ఆశావర్కర్లు అంగీకరించిన తర్వాతనే మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమైన ఆశా వర్కర్లు