తెలంగాణ

భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నివేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళిక నివేదికలు ప్రజల ముందు పెట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు లేఖ రాశారు. 1.5 లక్షల కోట్ల రూపాయలతో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగించిందని ఆయన తెలిపారు. తుది సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు లేకుండా ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తుది సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్ధంగా ఉంటే వారానికోసారి ప్రతిపాదిత డిజైన్లను, ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం-రంగారెడ్డి పథకానికి ప్రతి వారం కోట్లాది రూపాయలు పెంచుతున్నారని ఆయన ఉదహరించారు. ప్రభుత్వం వద్ద సమగ్ర రిపోర్టు ఉన్నట్లయితే వాటిని ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి పథకం, ప్రాణహిత-ఆదిలాబాద్, కాటేశ్వరం, సీతారామ, దిండి ప్రాజెక్టుల రిపోర్టులు సిద్ధంగా ఉంటే తమకు పంపించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు రాసిన లేఖలో కోరారు.