తెలంగాణ

తొలగని ఫ్లోరైడ్ బండ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 17: ప్రభుత్వాలెన్ని మారినా నల్లగొండ జిల్లా ప్రజలపై ఫ్లోరైడ్ బండ బాధ తొలగడం లేదు. గత ప్రభుత్వాలు చేపట్టిన మంచినీటి పథకాలు ప్రజలకు సరిపడా రక్షిత మంచినీటి జలాలు అందించడంలో విఫలమవుతున్న తరుణంలో స్వరాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం తమకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్యను దూరం చేస్తారని భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే రెండేళ్ల పాలనలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత జలాల సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మార్పులేమీ లేకపోవడంతో గత కృష్ణా మంచినీటి పథకాలు మూడు నాలుగు రోజులకొకసారి, వారానికి ఒకసారి ప్రాంతాల వారీగా అందిస్తున్న మంచినీరే ప్రస్తుతం జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం కోసమంటూ జలసాధన సమితి, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి, జిల్లా రాజకీయ పక్షాలు సాగించిన పోరాటాలతో చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండగా, డిండి ఎత్తిపోతల టెండర్ల దశను కూడా దాటలేదు. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రభుత్వం మానస పుత్రికగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై ప్రజలు భారీ ఆశలే పెట్టుకోగా ప్రస్తుతం ఈ పథకం తొలివిడత పనులు గ్రామాల్లో ముమ్మురంగా సాగుతుండగా కృష్ణా, గోదావరిలు ఎప్పుడు తమ ఇళ్లకు చేరుతాయోనని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు.
నామమాత్రంగా ఫ్లోరోసిస్ చికిత్స విభాగాలు
జిల్లాలో 2.5 పిపిఎం కంటే ఎక్కువగా ఫ్లోరైడ్ జలాలున్న మం డలాలు 17 ఉండగా, 31 మండలాలు 1.5 నుండి 2.5 పిపిఎం ఫ్లోరైడ్ సమస్య నెలకొంది. ఫ్లోరోసిస్‌తో ప్రజలు ఎముకలు, దంత, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురువుతూ కాళ్లు, చేతుల వంకర్లతో నడి వయసులోపునే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. రాష్టప్రతి కలాం..ప్రధాని వాజపేయిల నుండి ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన సీఎంలందరికీ ఫ్లోరైడ్ కష్టాలు వివరించినా నేటికీ ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టలేని దుస్థితిపై బాధితులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఫ్లోరైడ్ నుండి విముక్తి కోరుతూ కృష్ణా జలాలు అందించాలంటూ 1996 లోక్‌సభ ఎన్నికల్లో జలసాధన సమితి కింద 480 నామినేషన్ల దాఖలుతో వారు నిరసన తెలిపారు. 1997లో ఆవిర్భవించిన ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి న్యాయపోరాటంతో ఫ్లోరైడ్ పీడితులకు రక్షిత మంచినీటి జలాలు అందించాలంటూ 2001 ఏప్రిల్‌లో 24న హైకోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది. 2012 జూలై 7, 8లలో స్పీకర్ నాదెళ్ల మనోహర్ ఆ ధ్వర్యంలోని శాసనసభ పక్ష కమిటీ సూచించినా ఫ్లోరైడ్ విముక్తి దిశగా శాశ్వత పరిష్కారం దిశగా పురోగతి కొరవడుతూనే ఉంది. 2013లో ఫ్లోరోసిస్ నివారణ దిశగా 17 ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ సెల్, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఫ్లోరోసిస్ చికిత్స విభాగాలు సైతం నామమాత్రంగా మారాయి.
ఫ్లోరైడ్‌ను దూరం
చేయలేని కృష్ణా పథకాలు
ప్రస్తుతం జిల్లాలో ఎఎమ్మార్పీ (ఎస్‌ఎల్‌బిసి) ఎత్తిపోతల ప్రా జెక్టు జిల్లా పరిధిలోని 1191 గ్రామాలకు, జంటనగరాలకు కృష్ణా తాగునీటిని అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ మార్గంలో కొన్ని మండలాలకు, ఉదయ సముద్రం, సాగర్ ఎడమకాలువ పరిధిలో మరికొన్ని మండలాలను కలిపి మొత్తం 2,200 ఆవాసాలకు కృష్ణా మంచినీటి పథకాలను అనుసంధానించారు. ఇందుకు 2004నుండి 2014వరకు 86 కృష్ణా మంచినీటి పథకాలను 1163 కోట్లతో చేపట్టారు. వీటిలో ఇప్పటిదాకా 609 కోట్ల మేరకు ఖర్చు చేసి 1190 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. వాటిలో కొత్తగా 71 కోట్లతో మంజూరైన 16 పథకాల పనులు చేపట్టలేదు. వాటితో పాటు జిల్లా పరిధిలోని అన్ని కృష్ణా మంచినీటి పథకాలను మిషన్ భగీరథలో చేర్చి ఇంటింటికీ మంచినీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కృష్ణా మంచినీటి పథకాలు అసంపూర్తిగా ఉండటం, నిర్మాణ లోపాలు, నీటి కొరత కారణంగా ప్రధానంగా ఫ్లోరైడ్ పీడిత మండలాలైన చండూర్, మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్‌లలో సైతం నాలుగైదు రోజులకుకొకసారి మంచినీటి సరఫరా జరుగుతుండడంతో అక్కడి ప్రజలు స్థానిక పంచాయతీ బోర్ నీటిని లేక వాటర్ ఫ్లాంట్‌ల అరకొర శుద్ధి జలాలను తాగునీటిగా వినియోగిస్తు ఫ్లోరైడ్ సమస్యగా పూర్తిగా దూరం కాలేకపోతున్నారు. పలు గ్రామాల్లో కృష్ణానీరు, పంచాయతీల బోరు నీరు ఒకే ట్యాంకుల నుండి సరఫరా జరుగుతుండడం కూడా కృష్ణా మంచినీటి పథకాల డొల్లతనాన్ని చాటుతోంది. పాఠశాలు, హాస్టళ్లకు కృష్ణా మంచినీటి పథకాలకు అనుసంధానాలు లేక రేపటి పౌరులు ఫ్లోరోసిస్ జలాలనే తాగుతున్నారు.
మిషన్ భగీరథపైనే ఆశలన్నీ..!
జిల్లాలో ప్రస్తుత కృష్ణా మంచినీటి పథకాలు ఫ్లోరైడ్ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపలేని క్రమంలో ఇక ఆశలన్నీ మిషన్ భగీరథపైనే పెట్టుకున్నారు. ఉద్యమకాలంలో జిల్లాలో ఫ్లోరైడ్‌పై పోరుయాత్ర చేసి ప్రత్యక్షంగా జిల్లా ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను చూసి స్వయంగా చూడుచూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ పాటలు సైతం రాసిన సిఎం కెసిఆర్ జిల్లా ప్రజలకు కృష్ణా తాగునీటిని అందించే లక్ష్యంతో 3,880 కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. మొదటి దశలో 2016 నాటికి 622 ఆవాసాలకు రక్షిత జలాలు అందించే లక్ష్యంతో చేపట్టిన పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. ఏ గ్రామం వెళ్లిన భగీరథ పైపులైన్ల పనులు, నిర్ధేశిత ప్రాంతాల్లో మంచినీటి పంపింగ్ ట్యాంకుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. పథకం రెండో దశలోని గ్రామాలకు 2017 డిసెంబర్ నాటికి మంచినీటి సరఫరా చేయాలని నిర్ధేశించుకున్నారు. అయితే మిషన్ భగీరథకు నీటి కొరత లేకుండా జిల్లాకు సంబంధించి ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినట్లయితేనే జిల్లా వాసుల ఫ్లోరైడ్ కష్టాలు తీరుతాయని రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి.
రెండేళ్లలో మార్పేమీ లేదు
రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కృష్ణా మంచినీటి పథకాల విస్తరించకపోవడం, పథకాల నిర్వాహణలో లోపాలతో తమకు వారానికి ఒకసారి కృష్ణానీరు అందుతుందని దీంతో స్థానికంగా శుద్ధి ఫ్లాంట్‌ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నామని లెంకలపల్లి ఫ్లోరైడ్ బాధితుడు మేదరి రాములు అన్నారు.