తెలంగాణ

జూరాలకు కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 24: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు గత మూడు రోజులుగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.39 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 21,000 క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం జూరాల నుంచి 16 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అదేవిధంగా భీమా ప్రాజెక్టుకు 450 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, ప్యానల్ కెనాల్‌కు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువలకు 800 క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 16,670 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 20 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 419.920 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15,772 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 17,606 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో జూరాల వద్ద జలకళ మొదలైంది. నిండుకుండలా జూరాల జలాశయం కళకళలాడుతోంది.
ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జెన్‌కో అధికారులు జూరాల జలవిద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్ల ద్వారా ఆదివారం విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిలో 16 వేల క్యూసెక్కులను వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరద స్థిరంగా ఉండడంతో మరో వారం రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండబోదని జెన్‌కో అధికారులు అంటున్నారు.
నెట్టెంపాడుకు కొనసాగుతున్న పంపింగ్
ధరూరు: జూరాల ప్రాజెక్టు వరద నీటిని దృష్టిలో ఉంచుకొని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా లిఫ్ట్-1 ద్వారా గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌కు, లిఫ్ట్-2 ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఆదివారం కూడ నీటి పంపింగ్ కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కులను వినియోగించుకొని నీటిని రిజర్వాయర్‌లో నింపేందుకు కృషి చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. ఇప్పటికే ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ఒక టిఎంసికి నీరు చేరిందని, వారం రోజులు పంపింగ్ సాగితే రెండున్నర టిఎంసిలు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆధారపడిన రిజర్వాయర్లకు నీటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నీటిని నింపుతుండడంతో గద్వాల ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ తిలకించేందుకు పెద్దసంఖ్యలో రిజర్వాయర్ ప్రాంతానికి తరలివస్తున్నారు.

నెట్టెంపాడు లిఫ్ట్-2 ద్వారా నీటి పంపింగ్ దృశ్యం

ఇరిగేషన్ శాఖలో హై అలర్ట్
హెడ్‌క్వార్టర్‌లో ఉండక పోతే చర్యలు
ఇంజనీర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 24: ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున నీటిపారుదల శాఖ మంత్రి హై అలర్ట్ ప్రకటించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిఇలు, ఎస్‌ఇలు అందరూ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని సూచించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో వరద ఉధృతి, ఇన్‌ప్లో, అవుట్ ప్లోను అంచనా వేయాలని తెలిపారు. నీటి ప్రవాహ ఉధృతిని ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలోనూ చాలా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయని, పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నా అధికారులు అందుబాటులో లేరని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి, జూరాలలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పారు. సీనియర్ అధికారులంతా అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. ఆదేశాలు పాటించని, హెడ్ క్వార్టర్స్‌లో, ప్రాజెక్టు సైట్స్ దగ్గర అందుబాటులో ఉండని అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.