తెలంగాణ

లక్ష్మారెడ్డి, పాపిరెడ్డి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2 లీకేజీ అయినట్లు సిఐడి దాదాపు నిర్ధారణకు వచ్చినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే మళ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బిజెపి, ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
ఈ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి.కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వెంటనే ఎంసెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. టి.పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ మీడియాతో మాట్లాడుతూ తాము మొదటి నుంచి వెలిబుచ్చిన అనుమానాలే నిజమయ్యాయని అన్నారు.
సిఐడి చెప్పినట్లు ఇది 30 కోట్ల వ్యవహారం కాదని, సుమారు 200 కోట్ల వ్యవహారమని ఆయన తెలిపారు. 1500 బయో మెట్రిక్ మిషన్లు పని చేయకపోతే ఎంతో మంది అనర్హులు పరీక్షలు రాసి ఉంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పరీక్షను వెంటనే మళ్లీ నిర్వహించాలని, సిఎం కెసిఆర్ దీనిపై వౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్-2 లీకేజీకి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప డిమాండ్ చేశారు. వారిని మొదటి దోషులుగా గుర్తించి, కేసు నమోదు చేసి బర్తరఫ్ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంసెట్-2ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని తొలగించాలని, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి బి.సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.