తెలంగాణ

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది. సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులు బి. భుజంగరావు, జి. సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ బి. చంద్రకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉపాధ్యాయుల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలేమీకావని అన్నారు. కేవలం జీతాలే కాదు ఆత్మగౌరవం కోరుకుంటారని చెప్పారు. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నందునే ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయుల కృషిని ప్రభుత్వం గుర్తించాలని, పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యాను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడిబాట ప్రవేశపెట్టింది కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించకుంటే పిల్లలు బడిబాట ఎలా పడుతారని ప్రశ్నించారు. తెలంగాణలోని 12వేల పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కరువయ్యాయని అన్నారు. కనీసం తాగడానికి నీరు, మరుగుదొడ్డు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. భుజంగరావు మాట్లాడుతూ ప్రజాబీష్టం మేరకు పూర్వ ప్రాథమిక, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సర్వీసు నిబంధనల సమస్య సత్వరం పరిష్కరించి డిఇఓ, ఎంఇఓ, డైట్ లెక్చరర్ల పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.