తెలంగాణ

భారతావనిని శక్తిమంతంగా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 31: ఒకనాడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న భారత దేశానికి పునర్వైభవం తేవాలని, ఇందుకు దేశాన్ని శక్తివంతంగా చేయడానికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అత్యవసరమూ, అనివార్యమని గుంటూరు దత్త పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాల ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా విశ్వంజీ మాట్లాడుతూ, తీవ్ర దీక్షలో ఉన్న తనను, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, దేవస్థానం ఎసి సుప్రియ ఆహ్వానించినపుడు, అంత్య పుష్కరాలకు తనను ధర్మపురి క్షేత్రంలో తమ సన్నిధిన ఉండాలని నరసింహస్వామి ఆదేశించారని వివరించారు. మానవునిలో ఉన్న దానవత్వాన్ని సమూలంగా పారదోలి, మానవత్వాన్ని జాగృతం చేయడమే నరసింహ అవతార లక్ష్యమన్నారు. విశ్వంలో, భూమిపై, శరీరంలో మూడొంతులు నీరు ఉన్నదని, పంచ భూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాల మధ్య ఏకీకరణ సాధించి సమతౌల్యం సాధించాలన్నారు. అందులో భాగంగా జల దేవతలను పూజించాలని, జలంలో సృష్టికి మూలమైన శక్తి ఉందన్నారు. ధర్మపురి క్షేత్రంలో సనాతన, సాంప్రదాయ పద్ధతులలో ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. యాదగిరి రీతిలో తెలంగాణలోని పుణ్యతీర్థం, క్షేత్రమైన ధర్మపురి అభివృద్ధి జరగాలని, సిఎం కేసిఆర్‌కు తాను సూచిస్తానరు. నరసింహ దివ్య దర్శన భాగ్యంతో తమకు సంపూర్ణ శాంతి చేకూరిందని స్వామీజీ అన్నారు.

ధర్మపురి గోదావరి వద్ద మాట్లాడుతున్న విశ్వయోగి విశ్వంజీ