తెలంగాణ

ఇంతకీ పార్టీవారికి ఏం చెప్పినట్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన పర్యటన, ప్రసంగం ఒకింత నిరాశనే మిగిల్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలతోపాటు బిజెపి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ ప్రధాని పాల్గొన్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన బిజెపి మహా సమ్మేళన్‌కు భారీయెత్తున పార్టీకి చెందిన శ్రేణులు తరలివచ్చాయి. తొలిసారిగా హైదరాబాద్‌లో కాలుమోపిన ప్రధాని మోదీ, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తమకు దిశా నిర్దేశం చేస్తారని స్థానిక నేతలు, కార్యకర్తలు ఆశించారు. అయితే మోదీ మాత్రం తనదైన ధోరణిలో గత యుపిఎ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ, ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దాడులను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించలేదు. ప్రధాని రాక సందర్భంగా తాము బహిరంగ సభ నిర్వహించడం లేదని, తెలంగాణలోని 15 వేల పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న పార్టీ కమిటీల నాయకులనే ఆహ్వానించామని బిజెపి రాష్ట్ర నాయకులు గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌తో బిజెపి అనుసరించాల్సిన వ్యూహమేమిటి, వచ్చే ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలను కనబరచాలంటే తీసుకోవలసిన చర్యలేమిటి వంటి అంశాలపై ప్రధాని తమకు కర్తవ్య బోధ చేస్తారని ఆశించిన నేతలకూ, కార్యకర్తలకూ ఆశాభంగం తప్పలేదు.
ఎల్‌బి స్టేడియంలో సభ ముగిసిన తర్వాత కొంతమంది నాయకులు సభ గురించి ముచ్చటించుకుంటూ ఇంతకూ తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పని తీరును, చేపట్టిన పథకాలను పొగుడుతున్నారని, ఇప్పుడు ప్రధాని కూడా కెసిఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తే ఇక తాము చేసే పోరాటాలకు అర్థమే ఉండదని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎల్‌బి స్టేడియంలో పార్టీ నిర్వహించిన సభలో నేతలు మండిపడగా, గజ్వేల్ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై ప్రధాని ప్రశంసలు కురిపించారనీ, అగ్ర నేతల ధోరణి ఇలా ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేస్తామని బాధ పడుతున్నారు.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, బిజెపి శ్రేణుల సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణే కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వీసమెత్తు కూడా విమర్శలు చేయకపోవడాన్ని బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగస్టు 15నుంచి సెప్టెంబర్ 17 వరకూ తిరంగా యాత్ర నిర్వహించాలంటూ పిలుపు ఇవ్వడం మినహా ప్రధాని తమకు చేసిన దిశానిర్దేశమేమీ లేదంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం. ‘మిమ్మల్ని చూస్తుంటే తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించిన మోదీ, దానికి కొనసాగింపుగా తాము అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.

చిత్రం.. తెరాస నుంచి తెలంగాణను రక్షించాలంటూ
ప్లకార్డు ప్రదర్శిస్తున్న ఓ పార్టీ కార్యకర్త