తెలంగాణ

మీ ఆశీస్సులే.. మాకు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ‘అన్ని వేల కోట్లు కావాలి, ఇన్ని వేల కోట్లు కావాలని అడగటం లేదు.మీ (ప్రధాని) ప్రేమ, ఆశ్వీర్వాదం ఉంటే చాలు వాటంతకు అవే వస్తాయన్న అవగాహన కలిగిన వ్యక్తిని’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లా గజ్వెల్‌లో ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి..రాష్ట్రాల అవసరాలేమిటో ఆయనకు తెలుసునన్నారు. రాష్ట్రాలకు ఏమి కావాలో వాటి అవసరాలకు అనుగుణంగా ఆయన సారథ్యంలోని కేంద్రం పని చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో కేంద్రం రాష్ట్రాలకు 32 శాతం నిధులను కేటాయించగా, నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక దీనిని 42 శాతానికి పెంచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రంలో అవినీతికి ఆస్కారం లేని విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీదని, తన సుదీర్ఘ రాజకీయాల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని ఎన్డీఆర్ సర్కార్‌ను కొనియాడారు. గోదావరి, కృష్ణలో తాము 13 వందల టిఎంసిల నీటిని వినియోగించుకోవాల్సి ఉందని, ఈ నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణలో ఒక నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడిన రాష్టమ్రని, ఇక్కడ 80 శాతం బిసిలు, మైనార్టీలు, అట్టడగు వర్గాల ప్రజలు ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, కేంద్రం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున మాత్రమే ఇస్తోందని, దీనిని పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని కెసిఆర్ అభ్యర్థించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ పూర్తి చేయడానికి ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలన్నారు. అలాగే తెలంగాణకు గతంలోనే ప్రకటించిన ఐటిఐఆర్ ప్రాజెక్టు హామీ నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. గతంలో తెలంగాణలో జాతీయ రహదారులు 2500 కి.మీ మాత్రమే ఉండగా, ఒక్క సంవత్సరంలోనే తమకు 1900 కి.మీ జాతీయ రహదారులను మంజూరు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. తాము ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల 17 వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. మిషన్ కాకతీయ పథకానికి కూడా కేంద్రం నుంచి సహకారాన్ని కోరుతున్నామన్నారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవాలు, శంకుస్థానల వ్యయం రూ.17 వేల కోట్లని ముఖ్యమంత్రి అన్నారు. గుజరాత్ సిఎంగా నరేంద్ర మోదీ ఉన్నపుడే పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఓ కార్యక్రమం వేదిక నుంచి ప్రత్యేక తెలంగాణకు ఆయన మద్దతు ప్రకటించారని కెసిఆర్ గుర్తు చేశారు.
మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించడంతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి స్థాపించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి, ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో స్థాపించనున్న 1800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు, రామగుండంలో ఎరువుల కార్మాగారం పునరుద్ధరణకు ప్రధాని మంత్రి శంకుస్థానలు చేశారు.