తెలంగాణ

మాది స్నేహహస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు కేంద్రం వెన్నుదన్ను తగాదాలుపడే కాలానికి చెల్లుచీటీ మీ హైదరాబాద్‌లాగే.. ఢిల్లీనీ చూడండి
కొత్త రాష్ట్రంలో పురోగతి పరుగు అభివృద్ధిపై సిఎం కెసిఆర్‌ది అంకితభావం రాష్ట్రాల మధ్య పోటీతోనే దేశ వికాసం
విద్యుత్, ఎరువుల కొరత లేకుండా చేశాం నీటి బొట్టు నిలిపితే.. మట్టి బంగారమే భగీరథ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

ఒకప్పుడు కేంద్రంతో రాష్ట్రాలకు తగాదాలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పోయింది. అవసరమైనప్పుడు కేంద్రానికి రాష్ట్రాలు, రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తూ సహకార సమాఖ్యకు స్పూర్తిని చాటుతున్నాయి

హైదరాబాద్, ఆగస్టు 7: ‘దేశంలోనే కొత్త రాష్ట్రం తెలంగాణ. తక్కువ వ్యవధిలోనే అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది. కేంద్రం అన్ని విధాలా అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ‘మీరు హైదరాబాద్‌ను ఎలా చూస్తారో, ఢిల్లీనీ అలాగే చూడండి’ అని ప్రధాని మోదీ స్నేహహస్తాన్ని అందించారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెసిఆర్ తనను ఎన్నోసార్లు కలిశారని, ప్రతిసారీ ఆయనలో రాష్ట్భ్రావృద్ధి పట్ల తపన, అంకితభావం కనిపించాయని ప్రధాని కొనియాడారు. ‘ఒకప్పుడు కేంద్రంతో రాష్ట్రాలకు తగాదాలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పోయింది. అవసరమైనప్పుడు కేంద్రానికి రాష్ట్రాలు, అదే మాదిరిగా రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తూ పరస్పర సహకార సమాఖ్యకు స్పూర్తిని చాటుతున్నాయి’ అని ప్రధాన ఉద్ఘాటించారు. కేంద్రం తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలకు రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. బిజేపియేతర పార్టీయే అయినా కేంద్రం తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలకు తెరాస పార్టీ, తెలంగాణ సిఎం కెసిఆర్ మద్దతు ప్రకటించారని ప్రధాని ప్రశంసించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆదివారం మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచే రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కోమటిబండ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న పోటీ దేశ సర్వోతో ముఖాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నిధులున్నంత మాత్రాన సరిపోదని, అభివృద్ధికి సరిపడ నీరుండాలన్నారు. రెండు వందల సంవత్సరాల కిందటనే మహాత్మగాంధీ జన్మస్థలం పోరుబందర్‌లో వర్షం నీరు వృధాకాకుండా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఉందని ప్రధాని గుర్తు చేశారు. గుజరాత్‌లోని కచ్‌లో ఇంటింటికీ మంచినీటిని అందించే వ్యవస్థ చూసిన తర్వాతనే రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకానికి స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణల చేపట్టడం వల్ల విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఎంతగానో ఉరట ఇచ్చిందని, విద్యుత్ కొరత నుంచి మిగులు విద్యుదుత్పత్తి చేసే దశకు రాష్ట్రాలు చేరుకున్నాయన్నారు. గతంలో విద్యుదుత్పత్తికి యూనిట్‌కు రూ.11.50 వ్యయం అవుతుండగా, తమ ప్రభుత్వం వచ్చాక అది రూ. 1.10కి చేరుకుందని ప్రధాని వివరించారు. విద్యుత్ సమస్య ఒక్కటేకాకుండా తమ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎరువుల కొరత లేకుండా చేయగలిగామన్నారు. గత ప్రభుత్వాలు ఎరువులకు సబ్సిడీ ఇచ్చేవని, కానీ ఎరువులు మాత్రం దొరికేవి కావన్నారు. గడిచిన రెండేళ్లుగా దేశంలో ఏ ముఖ్యమంత్రీ కూడా తమకు యూరియా కావాలని అడుగలేదని ప్రధాని గుర్తు చేశారు. గతంలో రైతులకు అందించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఇతర రసాయన పదర్థాలు కలిపి ఇతర దేశాలకు విక్రయించేవారని ప్రధాన మంత్రి అన్నారు. యూరియాకు నీమ్ కోటింగ్ చేయడం వల్ల ఒక్క గ్రామ్ యూరియా కూడా పక్కదారి పట్టడం లేకుండా పోయిందన్నారు. గోసంరక్షణ మన ధర్మమన్నారు. గోసంరక్షణను వివాదం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్తిస్తున్న శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. గోవును కేవలం పాలిచ్చే జంతువుగానే చూడొద్దన్నారు. దాని మల మూత్రాలు భూసారాన్ని పెంచుతుందని, ఎరువుల వాడకం వల్ల కలిగే దుష్ప్రరిణామాలను పోగొడుతుందని, ఫలితంగా రైతు మట్టిలో బంగారం పండించగలుగుతారని ప్రధాని పిలుపునిచ్చారు.
తెలుగులో తొలి పలుకులు
తొలుత ప్రధాని ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు.

చిత్రం.. మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి నీళ్ల పంపు తిప్పుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. సభకు హాజరైన ప్రజలు