తెలంగాణ

కెసిఆర్‌పై భ్రమలు తొలగిపోయాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలో బిజెపిపై భ్రమలు తొలిగిపోయాయని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బిజెపియేనని పలువురు తెలంగాణ బిజెపి నాయకులు స్పష్టం చేశారు. ఎల్‌బి స్టేడియంలో ఆదివారం జరిగిన బిజెపి మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోడీ హాజరు కావడానికి ముందు ప్రసంగించిన పలువురు బిజెపి నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందని, కెసిఆర్ పాలనను గాలికి వదిలేశారని, ప్రజలకు ఆయనపై భ్రమలు తొలిగిపోయాయని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అని ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన బిజెపి తెలంగాణ అభివృద్ధిలోనూ ముందుందని మురళీధర్ తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, శాసన సభలో 30 శాతం మంది పార్టీ మారారని, పార్టీలు మారని ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు.
అస్సాం స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా పని చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన బహిరంగ సభ ద్వారా నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే ఆగస్టునెలలో జరుగుతున్న సభలో మోదీ ప్రసంగిస్తారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. బిజెపి ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోడీ హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వం అని గతంలో కొందరు ప్రకటించారని గుర్తు చేశారు. మోడీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.