తెలంగాణ

స్టేడియంలో.. జనం మధ్య రాజాసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ‘మోదీతో మనం... మహా సమ్మేళనం’ పేరిట బిజెపి ఆదివారం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో గోషామహల్ నియోజకవర్గం ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజల మధ్యనే కూర్చోవాల్సి వచ్చింది. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, రాజా సింగ్ తప్ప మిగతా నలుగురూ వేదికపై ఆసీనులయ్యారు. రాజా సింగ్ సభా ప్రాంగణానికి రావడంతోనే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఆయన కూడా అందరినీ పలుకరిస్తూ సభికుల మధ్యనే కూర్చొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రధాని మోదీకి కాషాయ రంగు తలపాగ పెట్టారు. చేనేత కార్మికులు నేసిన శాలువతో ప్రధానిని సన్మానించారు. పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రసంగించేందుకు ఉద్యుక్తులైనప్పుడు కూడా కార్యకర్తలు ఈలలు వేస్తూ, కరతాళధ్వానాలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకూ సభా ప్రాంగణంలో కార్యకర్తలు పలచగా ఉండడంతో నాయకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కాగా 5 గంటల తర్వాత అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి, ఎసిపి సురేందర్ రెడ్డి స్టేడియం చుట్టూ తిరుగుతూ భద్రతను పర్యవేక్షించారు.