తెలంగాణ

బహిష్కరించండి... లేదా ఆత్మప్రబోధంతో ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 20: శాసనమండలికి ఈనెల 27న జరిగే ఎన్నికలను ఓటర్లయిన టిడిపి ప్రజాప్రతినిధులు బహిష్కరించనైనా బహిష్కరించాలని, లేకుంటే ఆత్మప్రభోధంపై ఓటైనా వేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌విఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను పశువుల సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు, ఓటర్ల కొనుగోలు వ్యతిరేకమని, తమ వద్ద డబ్బులు కూడా లేవని, అందుకే తాము బరిలో లేమన్నారు. ఇదిలావుండగా, యాదాద్రి జిల్లా సాధనకై అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
ఇప్పటివరకు దీక్షలు, బంద్‌లు, ర్యాలీలు, ధర్నా, గిరిప్రదర్శనలు చేశామని ఆయన అన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను కలిపి యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో విమానాశ్రయం ఉందని, యాదాద్రిలో కూడ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. యాదాద్రి జిల్లాను గజ్వేల్‌లో కలిపి సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయడం వల్ల భువనగిరి, ఆలేరు ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. యాదాద్రి జిల్లాకై అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎండి.యూసుఫ్, పటేల్ రమేష్‌రెడ్డి, సాధినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.