తెలంగాణ

రక్తమోడిన ఔటర్ రింగ్‌రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడు సహా ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మరొకరు పేర్వారం అల్లుడికి స్వయానా తమ్ముడి కొడుకు. ఈ దుర్ఘటనతో మాజీ డీజిపి ఇంట్లో విషాదం అలుముకుంది. పంజాగుట్టకు చెందిన సుభాష్ పవార్ కుమారుడు, ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వరుణ్ పవార్ (22), అతడి దగ్గరి బంధువుకుమారులు అమిత్ పవార్ (20), రాహుల్ పవార్, ఎంబిబిఎస్ విద్యార్థి జ్ఞానదేవ్ (21)తో కలిసి సొంత ఫామ్ హౌస్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం ఆరుగంటల సమయంలో వారంతా హైదరాబాద్ బయలుదేరారు. పటాన్‌చెరు వైపునుంచి శంషాబాద్‌కు ఎపి-09 -సిక్యూ- 5553 నెంబర్‌గల స్కోడా కారులో వస్తూండగా రాజేంద్రనగర్ మండలం కోకాపేట్ గ్రామం సరిహద్దు ఔటర్ రింగ్‌రోడ్డులోని విప్రో జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జు అయింది. మాజీ డిజిపి పేర్వారం కూతురి కుమారుడైన వరుణ్ పవార్, ఆయన అల్లుడి సోదరుడి కుమారుడు అమిత్ పవార్, మరో విద్యార్థి జ్ఞానదేవ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో రాహుల్ పవార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రగాయాలతో బాధపడుతున్న రాహుల్ పవార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత వీరు ఎవరన్నది పోలీసులకు వివరాలు తెలియరాలేదు. కారు నెంబర్ ఆధారంగా మాజీ డిజిపి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు బంధువులకు చెందిన కారుగా పోలీసులు తెలుసుకున్నారు. దీంతోవెంటనే మాజీ డిజిపి పేర్వారం రాములకు సమాచారం అందించారు. ఈ సంఘటనలో మాజీ డిజిపి పేర్వారం రాములు మనువడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి శంషాబాద్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్ వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. పదేళ్ల క్రితం తన కూతురు మరణించిందని, నాటి నుంచి వరుణ్ తన వద్దే ఉంటున్నాడంటూ దుఃఖాన్ని అపుకోలేకపోయారు. మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, తెలంగాణ డిజి భగవత్ రాములును పరామర్శించారు.

ఔటర్ రింగురోడ్డులో పాల వ్యానును కారు ఢీకొన్న ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు