తెలంగాణ

రామయ్యపై సర్కారు శీతకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 22: ఈ ఏడాది గోదావరి పుష్కరాలు ఎంతో వైభవంగా జరిగాయి. జూలై నెలలో తెలంగాణ రాష్ట్రం గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు ఆయా క్షేత్రాలకు నిధులు కూడా ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఖమ్మం జిల్లాకు రూ.1.50కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటన కూడా జారీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. జిల్లా యంత్రాంగం హడావుడిగా పనులు చేపట్టింది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సుమారు రూ.1.30కోట్లు ప్రకటించారు. ముందుగా పనులు చేయాలని దేవస్థానాన్ని ఆదేశించారు. దీంతో టెండర్లు పిలిచి పనులు నిర్వహించారు. తీరా ఇపుడు బిల్లుల చెల్లింపు వచ్చేసరికి ఆ నిధులు దేవస్థానం నుంచే చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. జిల్లా మొత్తం ఖర్చు చేసిన రూ.1.50కోట్లు రామయ్య నెత్తిమీదే ప్రభుత్వం బాదేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇపుడు దేవస్థానాన్ని భరించమడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. పుష్కరాలు జరిగిన జూలై 14 నుంచి 25 వరకు సర్కారు దేవస్థానం ఆదాయంపై అనేక కొర్రీలు పెట్టింది. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు. ఆర్జిత సేవలు ద్వారా ఆదాయం రాబట్టుకునేందుకు దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసుకుంటే వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. సర్వదర్శనం పేరుతో ఆర్జిత సేవలను రద్దు చేసింది. దీంతో ఆదాయం కోల్పోవలసి వచ్చింది. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్లు విక్రయించాలన్నా అనేక అవాంతరాలు సృష్టించారు. సుమారు రూ.4కోట్ల వరకు దేవస్థానం ఖర్చు చేసింది. వచ్చిన ఆదాయం రూ.6కోట్లు. అంటే పుష్కరాల్లో రాముని ఆదాయం రూ.2కోట్లే. ఆదాయం విషయాన్ని పక్కనబెడితే ప్రభుత్వ ఉత్సవాలకు సైతం పైసా విదల్చడం లేదు. భక్తుల ద్వారా వచ్చే ఆదాయమే రామునికి మిగిలేది. ఉద్యోగుల జీతభత్యాలు, ఉత్సవాల నిర్వహణ, ప్రసాదాలు ఇతరత్రా అన్ని పనులకు భక్తులు ఇచ్చేవే. కానీ పుష్కరాల్లో ఆదాయ మార్గాలను మూసివేసి, తీరా ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా నిలిపివేయడంతో దేవస్థానం అధికారులు కంగుతిన్నారు.